Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: అత్తా, మేనల్లుడు మధ్యలో పీకే.. మమతా బెనర్జీకి తలనొప్పిగా మారిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’..

వెనుక గొయ్యి.. ముందు నుయ్యి అన్నట్లుగా మారింది. ఇంత కాలం కుడి, ఎడమలుగా తనను ముందుకు తీసుకుపోయిన తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు ఎడమొహం పెడమొహంలా మారిపోయారు. 

West Bengal: అత్తా, మేనల్లుడు మధ్యలో పీకే.. మమతా బెనర్జీకి తలనొప్పిగా మారిన ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’..
Mamata Banerjee
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 12, 2022 | 7:15 PM

ఎంత వేగంగా పైకి వెళ్లిన వస్తువు.. అంతకంటే వేగంగా కిందికి పడుతుందన్నది ప్రకృతి నియమం. తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి అచ్చు ఇలానే ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద తలనొప్పిగా మారింది. వెనుక గొయ్యి.. ముందు నుయ్యి అన్నట్లుగా మారింది. ఇంత కాలం కుడి, ఎడమలుగా తనను ముందుకు తీసుకుపోయిన తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పుడు ఎడమొహం పెడమొహంలా మారిపోయారు.

పార్టీని అంతర్గతంగా పునర్వ్యవస్థీకరించాలని భావించిన అభిషేక్‌ బెనర్జీ.. ఐ-ప్యాక్‌ సాయంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానాన్ని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన వర్గానికి చెందిన కొందరు నేతలు పార్టీలో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు.

ఇదిలావుంటే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జంట ఎంత ఎత్తుకు ఉత్సాహంగా పని చేశారో ఇప్పుడు అదే స్థాయిలో వివాదాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఓ సమయంలో కాబోయే ప్రధాని అంటూ కాశానికి ఎత్తిన పీకే ఇప్పుడు అదే స్థాయిలో మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించి, అనంతరం ఆమెను జాతీయ రాజకీయాల్లోనూ ప్రధానిని చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిషోర్ సంస్ధ ఐ-ప్యాక్ తో తృణమూల్ కాంగ్రెస్ దూరం పెరుగుతోంది. అయితే ఈ వివాదాన్ని రాజకీయ విశ్లేషకులు మాత్రం మరోలా అభివర్ణిస్తున్నారు. చాలామంది దీనిని దీదీ, ఆమె మేనల్లుడు మధ్య పెరుగుతున్న విబేధాలుగా చూస్తున్నారు.

మమత తర్వాత టీఎంసీలో అభిషేక్ సుపీరియర్ నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అత్తా, అల్లుళ్ల విబేధాల్లో ప్రశాంత్ కిశోర్‌కి చెందిన ఐ-ప్యాక్ చిక్కుల్లో పడింది. గతేడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయంలో ప్రశాంత్ కిశోర్ ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే. అయితే.. మేనల్లుడు అభిషేక్ పట్ల మమత అసంతృప్తిగా ఉన్నారని.. అతడిని పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరం ప్రధాన కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే  పీకే TMCతో విడిపోవచ్చని తెలుస్తోంది.

పార్టీ పగ్గాలు చేపట్టాలని అభిషేక్ ప్రయత్నిస్తున్నారని.. ముఖ్యంగా తృణమూల్ అధికారంలోకి వచ్చాక కూడా మమతా బెనర్జీ ఐ ప్యాక్ సాయం తీసుకుంటుండగా.. ఆమె పార్టీ నేతలు మాత్రం పీకే సభ్యుల జోక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీఎంసీ కీలక నేత చంద్రిమా భట్టాచార్య తాజాగా ప్రశాంత్ కిషోర్ సంస్ధ ఐప్యాక్ చట్ట విరుద్ధంగా తన సోషల్ మీడియా ఖాతాల్ని వాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో విపక్షాలకు కూడా ఇదో వరంగా మారింది. ఎన్నికల ముందు ఐప్యాక్ తన పేరు మీద ట్విట్టర్ ఖాతా సృష్టించిందని.. ఇవాళ అది తనకు తెలియకుండానే ‘ఒక వ్యక్తి ఒక పోస్ట్’ గురించి పోస్ట్ చేసిందని చంద్రిమ ఆరోపించారు. తాను దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాని చంద్రిమ తెలిపారు. దీంతో ఈ వివాదం బయటకు వచ్చింది.

దీనిపై స్పందించిన ఐ ప్యాక్.. తృణమూల్ కాంగ్రెస్ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను తాను నిర్వహించడం లేదని వివరణ ఇచ్చింది. అలా చేస్తున్నట్లు ఆరోపిస్తే మాత్రం అది కచ్చితంగా అబద్ధమేనని తెలిపింది. ఈ మేరకు చంద్రిమ చేసిన ఆరోపణల్ని ఐ ప్యాక్ తప్పుబట్టింది. వాస్తవానికి ఐప్యాక్ సాయంతో పార్టీని అంతర్గతంగా పునర్వ్యవస్థీకరించడానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ‘ఒక వ్యక్తి, ఒకే పదవి’ వ్యూహం అమలు తెరపైకి వచ్చింది.

ఇది పార్టీలో సీనియర్లకు నచ్చలేదు. గత వారం త్వరలో జరిగే స్ధానిక ఎన్నికల కోసం రెండు పోటీ అభ్యర్థుల జాబితాలు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రచారంపై అంతర్గత వివాదం తలెత్తింది. ఆ తర్వాత అభిషేక్ మద్దతు ఉన్న ఐప్యాక్ పై మమతకు అనుకూలంగా ఉండే వర్గం దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇది కాస్తా వివాదాలకు దారి తీస్తోంది.

బహుశా మమతా బెనర్జీ, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కంపెనీ I-PAC వేరే పార్టీ లేదా నాయకుడి నుండి పని పొందుతుంది. మమతా బెనర్జీ, ప్రశాంత్ కిషోర్ మధ్య మనస్పర్థలు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్న. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల మధ్య అంతరం పెరగడానికి ఒక ప్రధాన కారణం అని చాలా కారణాలు చెబుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ కంపెనీపై టీఎంసీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు

సోషల్ మీడియాలో విడుదల చేసిన జాబితాను ఇంకా తొలగించలేదు. దీనిపై ఓ నేత మాట్లాడుతూ.. ఇది పాస్‌వర్డ్ చోరీ కేసు అయితే.. రెండు రోజులుగా ఈ జాబితాను ఎందుకు తొలగించలేదన్నారు. అదే సమయంలో మీడియా నివేదికల ప్రకారం అభ్యర్థుల ఎంపికలో మా పాత్ర లేదని IPACతో అనుబంధించబడిన వ్యక్తి చెప్పారు. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం ఉందని టీఎంసీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం మమతా బెనర్జీ కానీ, అభిషేక్ కానీ దీనిపై స్పందించలేదు.

ఇవి కూడా చదవండి: LSG IPL 2022 Auction: ఈ ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.. KL రాహుల్‌తోపాటు ఎవరున్నారో తెలుసుకోండి..

IPL 2022 Auction, Day 1, Live: వేలం అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..