Andhra Pradesh: మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh News: ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే(Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం కూడా చాలా కష్టమన్నారు. నిథుల సమస్య కారణంగానే అమరావతి(Amaravati) అభివృద్ధి జరగలేదన్నారు. మూడు రాజధానులకు బదులు అమరావతిని అభివృద్ధి చేసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అథవాలే చేసిన ఈ కామెట్స్ చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధానికి నిధులు ఇవ్వాల్సిందని అథవాలే అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని యూపీఏ సర్కారు విస్మరించిందని విమర్శించారు.
ఏపీలో మూడు రాజధానులపై కేంద్ర మంత్రి అథవాలే కామెంట్స్.. వీడియో
Also Read..
Blue hydrogen: ఆ వ్యాపారం కోసం 75 బిలియన్ డాలర్లు వెచ్చిస్తానన్న అంబానీ.. ఉత్పత్తి కోసం..
Statue of Equality : భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్ర నామ పారాయణం.. లైవ్ వీడియో