Mukesh Ambani: తగ్గేదే లే.. ఆ రంగంలో ముకేశ్ అంబానీ భారీ పెట్టుబడులు.. పూర్తి వివరాలు..
Blue hydrogen: ఆసియా ఖండంలోనే సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్టీస్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Muktesh Ambani) మరో పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి దాకా ఇంధన వ్యాపారంలో ఉన్న అంబానీ..
Blue hydrogen: ఆసియా ఖండంలోనే సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్టీస్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Muktesh Ambani) మరో పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి దాకా శిలాజ ఇంధనాల(Fossil fuels) అమ్మకాల ద్వారా సంపాదించిన ముకేశ్ అంబానీ.. రానున్న కాలంలో క్లీన్ ఎనర్జీ(Clean energy) వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి దాకా పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ అమ్మకాలు చేస్తున్న సదరు సంస్థ 2035 నాటికి.. వాటికి బదులుగా క్లీన్ ఎనర్జీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సౌదీ అరేబియాలో ప్రతిపాదించబడిన అంతర్జాతీయ ప్లాంట్‌లతో పోటీపడనుంది.
గ్రీన్ ఎనర్జీకి(Green energy) సంబంధించి భవిష్యత్తులో దేశంలోనే అతి పెద్ద తయారీ దారుగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అది కూడా మిగిలిన పోటీదారులకంటే సరసమైర ధరకు. పెట్రోలియం కోక్ ను సింథసిస్ గ్యాస్(Syngas) మార్చి దాని నుంచి బ్లూ నైట్రోజన్ తయారు చేసేందుకు నాలుగు బిలియన్ డార్లు ఖర్చు చేసి నిర్మించిన ఫ్యాక్టరీని వినియోగిస్తోంది. ఒక కిలో బ్లూ నైట్రోజన్ ను రూ. 90 నుంచి రూ. 115 ఖర్చుతో తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. శిలాజ ఇంధనాలను ఉపయోగించి బ్లూ హైడ్రోజన్ తయారు చేస్తున్నారు. దీనిని ఉత్పత్తి చేసే సమయంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను రిలయన్స్ సంగ్రహిస్తుందని తెలుస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ధరలు సరసమైన ఖర్చుతో నీటి ఎలక్ట్రోలైసిస్ ద్వారా రానున్న కాలంలో అందుబాటు ధరలోకి వస్తుందని రిలయన్స్ చెబుతోంది.
అంబానీ గ్రీన్ హైడ్రోజన్‌ను సుమారు కిలోకు రూ. 75 చొప్పున ఉత్పత్తి చేస్తానని ప్రమాణం చేశారు. ఈ దశాబ్దం నాటికి నేటి ఖర్చుల నుండి 60% వరకు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పునరుత్పాదక ఇందనాల తయారీకి సుమారు 75 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టే ప్రణాళికలను అంబానీ ప్రకటించారు. భారత ప్రధాని మోదీ మిషన్ లో భాగంగా దేశాన్ని క్లీన్ హైడ్రోజన్ కు కేంద్రంగా మార్చేందుకు ఈ పెట్టుబడి ఉపకరించనుంది.
గ్రీన్ హైడ్రోజన్ తయారీ ఖర్చు తగ్గేలోపు.. ఈ వ్యాపారానికి సంబంధించి భారత్ లో హైడ్రోజన్ ఎకోసిస్టమ్ ను తీసుకొచ్చే తొలి కంపెనీగా రిలయన్స్ నిలవనుందని కంపెనీ చెబుతోంది. తరువాతి కాలంలో సిన్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ ఉత్పత్తుకి బదులుగా.. గ్రీన్ హైడ్రోజన్ ను వినియోగిస్తారని.. సిన్ గ్యాస్ మెుత్తాన్ని కెమికల్స్ రూపంలో మార్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రిలయన్స్.
ఇవీ చదవండి..
Mukesh Ambani: ముకేశ్ అంబానీకి నచ్చిన పాట.. ఆయన నోటే వినండి.. దానికి అర్థమేంటో తెలుసుకోండి..
Black hawk Chopper: గాల్లో చక్కర్లు కొట్టిన పైలెట్ రహిత ఛాపర్ .. వైరల్ వీడియో మీకోసం..