Black hawk Chopper: గాల్లో చక్కర్లు కొట్టిన పైలెట్ రహిత ఛాపర్ .. వైరల్ వీడియో మీకోసం..
Black hawk Chopper: పైలెట్ రహిత విమానాల(Pilotless Chopper) వాడకంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రారంభంలో అమెరికాలో కెంటకీ రాష్ట్రంలో ఒక బ్లాక్ హాక్(Black hawk) హెలికాప్టర్ పైలెట్..
Black hawk Chopper: పైలెట్ రహిత విమానాల(Pilotless Chopper) వాడకంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రారంభంలో అమెరికాలో కెంటకీ రాష్ట్రంలో ఒక బ్లాక్ హాక్(Black hawk) హెలికాప్టర్ పైలెట్ లేకుండా ప్రయాణించింది. దీనికి అవసరమైన ప్రత్యేక పరికరాలు, సాంకేతికత అందులో అమర్చడం వల్ల.. ఛాపర్ ముమారు 30 నిమిషాల పాటు గాల్లో విహరించింది. దీనిని సిమ్యులేషన్(Simulation) సాయంతో ఊహాజనితమైన నగరంలోని భవనాలను తప్పిస్తూ ఖచ్చితమైన ల్యాండింగ్ చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe
— Reuters Asia (@ReutersAsia) February 12, 2022
ఇలా పైలెట్ రహిత ఛాపర్ తయారు చేయటం వల్ల.. పైలెట్లు దానిని నడపటంపై దృష్టి సారించకుండా వారికి కేటాయించని మిషన్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టగలరని DARPA యొక్క టాక్టికల్ టెక్నాలజీ ఆఫీస్‌లోని ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ అంటూ చెస్ట్ ఫైట్ విజయవంతం అయినట్లు వెల్లడించారు. ఇలా ప్రత్యేక స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కలయిక వల్ల విమానయానాన్ని మరింత సురక్షితమైనదిగా తెలివైనదిగా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి 5న మొదటి టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా మానవరహిత బ్లాక్ హాక్ హెలికాప్టర్ దాదాపు 4,000 అడుగుల ఎత్తులో.. గంటకు 115 నుండి 125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. పాపులర్ సైన్స్ నివేదిక ప్రకారం.. ఇదే ఛాపర్‌తో సోమవారం మరో సిమ్యులేటెడ్ ఫ్లైట్ టెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..
N Chandrasekaran: రూ. 15.29 లక్షల కోట్లు పెరిగిన టాటా మదుపరుల సంపద.. దీని వెనుక బాహుబలి అతనేనా..
Anil Ambani: అంబానీ సోదరుడు అనీల్ కు సెబీ షాక్.. వారికి భారీ జరిమానా..