N Chandrasekaran: రూ. 15.29 లక్షల కోట్లు పెరిగిన టాటా మదుపరుల సంపద.. దీని వెనుక బాహుబలి అతనేనా..
N Chandrasekaran: టాటా లాంటి అతిపెద్ద కంపెనీని ముందుకు నడిపించటం అంటే అంత సులువైన అంశం కాదు. దానిని సమర్థవంతంగా నిర్వహించి టాటా సన్స్(Tata sons) గ్రూప్ కింద ఉండే అన్ని కంపెనీలనూ ముందుకు తీసుకెళ్లగల సత్తా ఆయనకు ఉందని టాటాలు నమ్మారు. అందుకే..
N Chandrasekaran: టాటా లాంటి అతిపెద్ద కంపెనీని ముందుకు నడిపించటం అంటే అంత సులువైన అంశం కాదు. దానిని సమర్థవంతంగా నిర్వహించి టాటా సన్స్(Tata sons) గ్రూప్ కింద ఉండే అన్ని కంపెనీలనూ ముందుకు తీసుకెళ్లగల సత్తా ఆయనకు ఉందని టాటాలు నమ్మారు. అందుకే టాటా సన్స్ ఛైర్మన్ గా ఎన్. చంద్రశేకరన్ గా(Chairman N Chandrasekaran) ఫిబ్రవరి 2017 న నియమించారు. ఆయన ఆ పగ్గాలు చేపట్టిన తరువాత టాటా గ్రూప్ కింద ఉన్న మెుత్తం 28 లిస్టెడ్ కంపెనీల్లో 19 నిఫ్టీ బెంట్ మార్క్ కంటే ఉత్తమమైన పనితీరును కనబరిచాయి. కంపెనీ బాధ్యతలు చేపట్టేటప్పుడు.. వాటాదారుల విలువను పెంచేందుకు, గ్రూప్ మూలధన కేటాయింపు విధానానికి “మరింత శక్తిని” తీసుకొచ్చేందుకు తను కృషిచేస్తానని అన్నారు. అప్పటి నుంచి టాటా గ్రూప్ షేర్ల విలువ రూ. 15.29 లక్షల కోట్లు పెరిగింది. అంటే 192 శాతం పెరుగుదల అని అర్థం. ఇదే సమయంలో నిఫ్టీ-50 సూచీ 132 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
ఈ కాలంలో సాఫ్ట్ వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ తన విలువను రూ. 4.8 లక్షల కోట్ల నుంచి రూ. 13.67 లక్షల కోట్లకు పెరిగింది. దీనితో పాటు గ్రూప్ కు చెందిన టైటాన్, టాటా కన్జూమర్, టాటా ఈఎల్ఎక్స్ఐ కంపెనీలు 400 నుంచి 900 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇవే కాక టాటా స్టీల్, టాటా పవర్, ఓల్టాస్, ట్రెంట్ కంపెనీలు సైతం 200 శాతం వృద్ధి చెందాయి. గడచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన పరితీరుకు ఈ ఫలితాలు అద్ధం పడుతున్నాయి.
చిప్ కొరతను పరిష్కరించేందుకు థాయ్‌లాండ్‌లో తయారీ కార్యకలాపాలను మూసివేయడంతో ప్రారంభిస్తే.. టాటా మోటార్స్‌కు సవాళ్లు అలాగే ఉన్నాయి. అయితే, టాటా మోటార్స్ మినహా, గ్రూప్ లాభాలు FY20 FY21లో 111% పెరిగి రూ.46,130 కోట్లకు చేరుకున్నాయి. వీటన్నిటికీ తోడు.. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, నాన్-కోర్ ఆస్తుల విక్రయం, కంపెనీ పునర్నిర్మాణం లాంటి చర్యల వల్ల డీ లివరేజింగ్ జరిగి కంపెనీ బ్యాలన్స్ షీట్ మెరుగుపడిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవీ చదవండి..
Anil Ambani: అంబానీ సోదరుడు అనీల్ కు సెబీ షాక్.. వారికి భారీ జరిమానా..
Paytm CashBack: మీ మొబైల్‌లో పేటీఎమ్ ఉందా..? నాలుగు రూపాయలు పంపించి, రూ. 100 పొందండి..