Anil Ambani: అంబానీ సోదరుడు అనీల్ కు సెబీ షాక్.. వారికి భారీ జరిమానా..

Anil Ambani Banned: గత నవంబరులో ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ముకేశ్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే.. భారత స్టాక్ మార్కెట్ రెగ్యూలేటింగ్ సంస్థ సెబీ(SEBI banned) పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీని..

Anil Ambani: అంబానీ సోదరుడు అనీల్ కు సెబీ షాక్.. వారికి భారీ జరిమానా..
Anil Ambani Barred
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 12, 2022 | 2:48 PM

Anil Ambani: గత నవంబరులో ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత ముకేశ్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే.. భారత స్టాక్ మార్కెట్ రెగ్యూలేటింగ్ సంస్థ సెబీ(SEBI banned) పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీని(Anil Ambani) సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఆయనకు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థపైనీ ఈ నిషేధాన్ని విధించింది. ఈ సంస్థలోని ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని.. ఈ కాలంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ట్రేడింగ్ కార్యకలాపాలు చేయరాదని సెబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంబానీ ఇప్పటికే తమ సంస్థలకు అప్పులు ఇచ్చిన విదేశీ సంస్థలతో పాటు దేశీయంగానూ న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, సీఈవో రవినారాయణ్ లపై సెబీ జరిమానా కూడా విధించింది. గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎండీకి సలహాదారుగా ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకానికి సంబంధించి సెక్యూరిటీల కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించారని సెబీ నిర్థించినందుకు ఈ చర్యలు చేపట్టింది.

చిత్రా రామకృష్ణకు రూ.3 కోట్లు, ఎన్‌ఎస్‌ఈ, నారాయణ్‌, సుబ్రమణియన్‌లకు తలో రూ.2 కోట్లు, ముఖ్య నియంత్రణ అధికారిగా ఉన్న వీఆర్‌ నరసింహన్‌పై రూ.6 లక్షలు చొప్పున జరిమానాలు విధించింది. ఆరు నెలల పాటు కొత్త ఉత్పత్తులు తీసుకురాకుండా ఎన్‌ఎస్‌ఈపై నిషేధం విధించింది. మూడేళ్ల పాటు రామకృష్ణ, సుబ్రమణియన్‌లు మార్కెట్‌ సంస్థల్లో పనిచేయరాదని సెబీ ఆదేశించింది.

ఇవీ చదవండి.. 

IRCTC News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 14 నుంచి ఆ సేవలు తిరిగి ప్రారంభం..

Nawab Family For 2600 Crores: పూర్వీకుల ఆస్తి కోసం 50 ఏళ్ల న్యాయపోరాటం.. రూ. 2600 కోట్ల ఆస్తి దక్కించికున్న వారసులు.. ఎలాగంటే..