IRCTC News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 14 నుంచి ఆ సేవలు తిరిగి ప్రారంభం..

IRCTC News: దేశంలో దూర ప్రాంతాలు చేసే అనేక మంది భారతీయ రైల్వేనే ఎంచుకుంటారు. కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి భారతీయ రైల్వే చాలా కాలం పాటు సాధారణ ప్రయాణికులకు దూరమైంది. కొంత కాలం తరువాత..

IRCTC News: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 14 నుంచి ఆ సేవలు తిరిగి ప్రారంభం..
Irctc
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 11, 2022 | 9:46 PM

IRCTC News: దేశంలో దూర ప్రాంతాలు చేసే అనేక మంది భారతీయ రైల్వేనే ఎంచుకుంటారు. కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి భారతీయ రైల్వే చాలా కాలం పాటు సాధారణ ప్రయాణికులకు దూరమైంది. కొంత కాలం తరువాత ప్రత్యేక రైళ్లను నడపటం ప్రారంభించిన సంస్థ.. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తన సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ నెల 14 నుంచి రైళ్లలో వండిన ఆహారాన్ని ప్రయాణికులకు అందించనుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం 2020 మార్చిలో ఈ సేవలను కరోనా వల్ల నిలిపివేసింది. సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల సౌకర్యార్థం సంస్థ తన సేవలను చాలా కాలం తరువాత పునరుద్ధరించింది.

ఈ సంవత్సరం జనవరి నుంచి 80 శాతం రైళ్లలో తాజా ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైల్వే.. ఇకపై అన్ని రైళ్లలో సేవలను ప్రారంభించనుంది. ఐఆర్సీటీసీ ఇప్పటికే అగస్టు 2021 నుంచి రెడీ టూ ఈట్ ఆహారాన్ని రైళ్లలో అందిస్తోంది.

ఇవీ చదవండి..

Fuel Cost Saving: వాహన ఖర్చు తగ్గించుకుని డబ్బు ఆదాచేయటం ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..

LIC Policy: రోజుకు కేవలం రూ. 262 ఇన్వేస్ట్ చేసి.. రూ. 20 లక్షలు పొందండి..