Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో అత్యుత్తమ వడ్డీ రేటు.. నెలకు రూ.12,500తో కోటి రూపాయలు మీ సొంతం..

పోస్ట్ ఆఫీస్(Post Office) పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించే వివిధ సురక్షిత పథకాలను అందిస్తుంది...

Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో అత్యుత్తమ వడ్డీ రేటు.. నెలకు రూ.12,500తో కోటి రూపాయలు మీ సొంతం..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 11, 2022 | 7:56 PM

పోస్ట్ ఆఫీస్(Post Office) పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించే వివిధ సురక్షిత పథకాలను అందిస్తుంది. మీరు మీ డబ్బును సురక్షిత పథకంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (PPF) పథకాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ PPF పథకంలో పెట్టుబడిదారులు సంవత్సరానికి 7.1% వడ్డీ(Intrest) రేటును అందుకుంటారు. పోస్టాఫీస్ పీపీఎఫ్ పథకంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1 లక్షా 50 వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ indiapost.gov.inలో పోస్ట్ ఆఫీస్ PPF పథకం గురించి పెట్టుబడిదారులు మరింత సమాచారం తెలుసుకోవచ్చు. పాలసీలో ఏకమొత్తం లేదా వన్-టర్మ్ పెట్టుబడి పెట్టవచ్చు. భారతీయ పౌరులు నేరుగా వారి PPF ఖాతాలను తెరవవచ్చు. మైనర్ విషయంలో సంరక్షకుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి కోసం పోస్ట్ ఆఫీస్ PPF ఖాతాను తెరవవచ్చు.

అంతేకాకుండా, ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సి కింద ఇన్వెస్టర్లు తమ పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే, ఆదాయపు పన్ను PPF పథకంలో వడ్డీ, మెచ్యూరిటీ ద్వారా వచ్చే ఆదాయం పన్ను రహితం. పెట్టుబడిదారులు తమ పాస్‌బుక్‌తో సహా ఖాతా మూసివేత పత్రాలను పోస్ట్ ఆఫీస్‌లో సమర్పించడం ద్వారా మెచ్యూరిటీ చెల్లింపును చేయవచ్చు. మీరు సంవత్సరానికి లక్ష 50 వేలు పెట్టుబడి పెడితే.. మెచ్యురిటీ వరకు రూ.1 కోటి వరకు పొందవచ్చు. నెలకు రూ.12,500 పెట్టుబడి పెట్టినా మెచ్యురిటీ వరకు రూ.1 కోటి వరకు పొందవచ్చు. పీపీఎఫ్ మెచ్యురిటీ 15 సంవత్సరాలు ఉంటుంది. అదనపు వడ్డీ ఆదాయాన్ని సంపాదించడానికి వారు మెచ్యూరిటీ వ్యవధిని 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

Read Also.. Digital Rupee: చైనా అనుభవంతో ముందే మేల్కొన్న భారత్.. డిజిటల్ రూపీతో ముందడుగు..