Pomegranate: దానిమ్మ సాగుతో అధిక లాభాలు.. పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ..

Pomegranate: దానిమ్మకి ప్రతి సీజన్‌లో డిమాండ్‌ ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు కె, సి, బి, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా 6, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

Pomegranate: దానిమ్మ సాగుతో అధిక లాభాలు.. పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ..
Pomegranate
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2022 | 2:13 PM

Pomegranate: దానిమ్మకి ప్రతి సీజన్‌లో డిమాండ్‌ ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు కె, సి, బి, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా 6, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఈ కారణాల వల్ల దానిమ్మకి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. రైతులు దానిమ్మ సాగు చేయడం ద్వారా చాలా లాభాలు పొందవచ్చు. అయితే ఈ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే మంచి దిగుబడిని సాధించవచ్చు. భారతదేశంలో దానిమ్మ సాగు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో జరుగుతుంది. దీని మొక్క మూడు నాలుగు సంవత్సరాలలో చెట్టుగా మారి ఫలాలను అందిస్తుంది. దానిమ్మ చెట్టు దాదాపు 25 సంవత్సరాలు ఫలాలను ఇస్తుంది.

దానిమ్మ పండించడం ఎలా?

దానిమ్మ ఉప-ఉష్ణమండల వాతావరణానికి చెందిన మొక్క. దానిమ్మ పండు అభివృద్ధికి పొడి వాతావరణం అవసరం. దాదాపు అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నీటి పారుదల, ఇసుకతో కూడిన నేలలకు ఇది బాగా సరిపోతుంది. సహజ ఎరువును ఉపయోగించడం ద్వారా రైతులు బంజరు భూమిలో కూడా దానిమ్మని పండించవచ్చు. మంచి దిగుబడి మెరుగైన రకాలను ఎంచుకోవాలి. గణేశ్‌ రకం దానిమ్మపండు మహారాష్ట్ర రైతులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రకమైన పండ్లు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయ. విత్తనాలు బలంగా గులాబీ రంగులో ఉంటాయి. దానిమ్మ మొక్కలను నాటడానికి సరైన సమయం ఆగస్టు నుంచి సెప్టెంబర్ లేదా ఫిబ్రవరి నుంచి మార్చి మంచి కాలంగా చెప్పవచ్చు. ఒక మొక్కను నాటేటప్పుడు 5-5 మీటర్లు లేదా 6 మీటర్ల దూరం ఉండాలి. దానిమ్మకి బిందు సేద్యం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. రాజస్థాన్ వంటి తక్కువ నీటి ప్రాంతాల్లో ఈ సాంకేతికత ఉత్తమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది 43 శాతం నీటిని ఆదా చేస్తుంది. ఉత్పత్తిలో కూడా 30 నుంచి 35 శాతం పెరుగుదల సాధ్యమవుతుంది.

ఉసిరిలో అద్భుత ఔషధ గుణాలు.. ఛాతిలో మంట, ఎసిడిటీ సమస్యలుంటే ఇలా చేయండి..?

Diabetic Patient: షుగర్ ఉన్నవారు బీట్‌రూట్ తింటే బెటర్.. ఈ 4 సమస్యలకి చక్కటి పరిష్కారం..

Hug Day 2022: కౌగిలింత వల్ల లవ్ హార్మోన్ పెరుగుతుంది.. శరీరంలో ఈ మార్పులు..?