ఉసిరిలో అద్భుత ఔషధ గుణాలు.. ఛాతిలో మంట, ఎసిడిటీ సమస్యలుంటే ఇలా చేయండి..?

Gooseberry: ఆధునిక కాలంలో చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజలు అధిక డోసు ఉన్న మందులను వాడుతున్నారు.

ఉసిరిలో అద్భుత ఔషధ గుణాలు.. ఛాతిలో మంట, ఎసిడిటీ సమస్యలుంటే ఇలా చేయండి..?
Gooseberry
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2022 | 2:17 PM

Gooseberry: ఆధునిక కాలంలో చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజలు అధిక డోసు ఉన్న మందులను వాడుతున్నారు. కొంతకాలం ఉపశమనం ఉన్నప్పటికీ తర్వాత సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటున్నాయి. అందుకే చాలామంది ఆయుర్వేదం మంచిదని సిఫార్స్‌ చేస్తున్నారు. ఉసిరిని ఉపయోగించడం ద్వారా ఈ ఆరోగ్య సమస్యలని వదిలించుకోవచ్చు. అయితే దీనిని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఉసిరి పొడి గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలకి చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. ఉసిరి ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిని ప్రతి సీజన్‌లో ఉపయోగించవచ్చు. దీనిని తినడం ద్వారా శరీరంలోని చాలా విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. కొద్ది క్షణాల్లోనే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఉసిరి పొడిని ఎలా ఉపయోగించాలి?

మీరు ఉసిరి పొడిని తినాలనుకుంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ పొడిని వేయాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని వడపోసి నిదానంగా తాగాలి. కొద్దిసేపట్లోనే మీకు ఛాతీలో మంట, కడుపులో వేడి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు తీసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. కడుపులో గ్యాస్ సమస్య దూరమవుతుంది. ఇది కాకుండా మీ శరీరం శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ప్రతి రోజూ ఒక ఉసిరికాయను తిన్నట్లతే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి. కఫం తగ్గుతుంది. మేధస్సు పెరుగుతుంది. వీర్యపుష్టి కలుగుతుంది. శారీరక బలం పెరుగుతుంది. త్రిదోషాలు నివారించవచ్చు. రోజుకు మూడు ఉసిరికాయల చొప్పున తింటే అన్ని రకాల పైత్యాలూ తగ్గుతాయి.

UGC: కాలేజీ, యూనివర్సీటీలకు UGC కీలక ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..

Viral Photos: వర్షపు నీటితో మాత్రమే దాహం తీర్చుకునే ఏకైక పక్షి ఇదే.. భూమిపై ఉన్న నీరు అస్సలు ముట్టుకోదు..?

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటర్‌కి 14పైసల ఖర్చు మాత్రమే..?