AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటర్‌కి 14పైసల ఖర్చు మాత్రమే..?

Snow Plus Electric Scooter: క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో+ ని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది.

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటర్‌కి 14పైసల ఖర్చు మాత్రమే..?
Snow Plus Electric Scooter
uppula Raju
|

Updated on: Feb 11, 2022 | 1:35 PM

Share

Snow Plus Electric Scooter: క్రేయాన్ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో+ ని విడుదల చేసింది. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం అని ప్రకటించింది. అయితే ఆర్థిక పరంగా బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కిలోమీటరు ప్రయాణించడానికి14 పైసలు మాత్రమే ఖర్చవుతాయి. గంటకు 70 కి.మీ నుంచి 130 కి.మీ మైలేజీని అందిస్తాయి. ఈ నెలఖారులోగా రెండు కొత్త హై-స్పీడ్ మోడళ్లు మార్కెట్‌లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.64,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త స్నో+ స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. ఈ ఎంపికలలో ఫెయిరీ రెడ్, సన్‌షైన్ ఎల్లో, క్లాసిక్ గ్రే, సూపర్ వైట్ ఉన్నాయి. ఈ స్కూటర్లు 2 సంవత్సరాల వారంటీతో వస్తాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, అనేక ఇతర రాష్ట్రాల్లోని 100 రిటైల్ స్టోర్లలో స్నో+ అందుబాటులో ఉంటుంది.

కొత్త ఎలక్ట్రిక్ వాహనం ఓల్డ్‌ స్కూటర్‌లా రూపొందించారు. డిజైన్ ఆకట్టుకునేలా ఉంటుంది. లైట్ మొబిలిటీ అవసరాల కోసం దీనిని నిర్మించినట్లు క్రేయాన్ మోటార్స్ పేర్కొంది. ప్రకాశవంతమైన రంగులు, గుండ్రని హెడ్‌ల్యాంప్‌లు, రౌండ్ రియర్-వ్యూ మిర్రర్స్‌ని అమర్చారు. స్కూటర్ పెద్ద, ఫ్లాట్ ఫుట్‌వెల్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. దీనిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది 250-వాట్ BLDC మోటారుతో వస్తుంది. స్కూటర్‌కు ట్యూబ్‌లెస్ టైర్లు, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ-స్కూటర్ 155 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. డ్రైవింగ్ రేంజ్ ఇంకా వెల్లడి కాలేదు. డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్, మొబైల్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ మెకానిజం, నావిగేషన్ (GPS) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Viral Photos: ఈ మోడల్‌ అందంలోనే కాదు ఆ విషయంలో కూడా సూపర్..?

White Hair: తెల్ల జుట్టుకి కారణం పోషకాహార లోపం.. డైట్‌లో ఈ ఆహారాలు ఉండాల్సిందే..?

ఆహారం జీర్ణమవడం లేదా.. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆయుర్వేద డ్రింక్‌తో సమస్యకి చెక్..?

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?