- Telugu News Photo Gallery Viral photos Model is beautiful pretty and blonde so people underestimate her they do not realise she study law
Viral Photos: ఈ మోడల్ అందంలోనే కాదు ఆ విషయంలో కూడా సూపర్..?
Viral Photos: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకోసం సర్జరీలు కూడా చేయించుకుంటారు. కానీ కొంతమంది పుట్టుకతోనే అందంగా ఉంటారు.
Updated on: Feb 11, 2022 | 1:18 PM

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకోసం సర్జరీలు కూడా చేయించుకుంటారు. కానీ కొంతమంది పుట్టుకతోనే అందంగా ఉంటారు. మోడల్స్‌గా, సినిమాలలో హీరోయిన్స్‌గా రాణిస్తారు. కానీ చాలామంది వారు పెద్దగా చదువుకోరని అనుకుంటారు.

24 ఏళ్ల గియులీ మోడలింగ్‌లో రాణిస్తుంది. పెద్దగా చదువుకోలేదని అనుకుంటారు. కానీ ఆమె అందంతో పాటు చదువులో కూడా ది బెస్ట్ అని చెప్పవచ్చు.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. గియులీ మోడలింగ్‌తో పాటు చదువు కూడా కొనసాగిస్తోంది. ఆమె లా చదువుతోంది. అందంగా ఉండే అమ్మాయిలకు చదువు ఉండదనే రూమర్‌ని పోగొట్టడానికి ప్రయత్నిస్తోంది.

భవిష్యత్తులో తాను ఎలా ఉండాలో.. ఏం సాధించాలో తెలుసని గియూలీ చెప్పింది. మోడలింగ్‌తో పాటు చదువులోను రాణిస్తూ అందరి ప్రశంసలు పొందుతుంది.

మోడల్ కావడంతో గియులీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 94,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.





























