White Hair: తెల్ల జుట్టుకి కారణం పోషకాహార లోపం.. డైట్‌లో ఈ ఆహారాలు ఉండాల్సిందే..?

White Hair: ఆధునిక కాలంలో తెల్లజుట్టుతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దీనిని నివారించడానికి మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ అన్నీ వాడుతున్నారు కానీ

White Hair: తెల్ల జుట్టుకి కారణం పోషకాహార లోపం.. డైట్‌లో ఈ ఆహారాలు ఉండాల్సిందే..?
White Hair
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2022 | 12:49 PM

White Hair: ఆధునిక కాలంలో తెల్లజుట్టుతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దీనిని నివారించడానికి మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడాక్ట్స్‌ అన్నీ వాడుతున్నారు కానీ ఎటువంటి ఫలితం ఉండదు. అంతేకాదు ఇందులో రసాయనాలు అధిక మోతాదులో ఉండటం వల్ల జుట్టు ఇంకా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. అందుకే హోం రెమిడిస్ ప్రయత్నిస్తే చాలా మంచిది. దీంతో పాటు పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు నెరిసిపోతుంది. అందుకోసం డైట్‌లో సూపర్‌ ఫుడ్స్‌ యాడ్ చేయాలి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. ఆకు కూరలు

మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ ఆకుకూరలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. తలకు చాలా మేలు చేస్తుంది. ఆకుకూరలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల పెరుగుదలకు సహకరిస్తాయి. పాలకూర, బచ్చలికూర, క్యాలీఫ్లవర్ మొదలైన ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.

2. పుట్టగొడుగులు

తెల్లజుట్టుని నివారించాలంటే పుట్టగొడుగులు డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో రాగితో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పుట్టగొడుగులలో యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది శిరోజాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా జుట్టును రక్షిస్తుంది.

3. బ్లూ బెర్రీలు

బ్లూబెర్రీస్‌లో జింక్, అయోడిన్, కాపర్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెలనిన్ పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేయడంలో గ్రేట్‌గా సహాయపడుతాయి. తెల్ల జుట్టుని నివారించడంలో తోడ్పడుతాయి.

4. డ్రై ఫ్రూట్స్‌

డ్రై ఫ్రూట్స్ గొప్ప అల్పాహారం మాత్రమే కాదు ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తాయి. ప్రతిరోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

5. సాల్మన్, ట్యూనా చేప

సాల్మన్ చేపలో ఒమేగా-3 ఉంటుంది. వెంట్రుకలు పెరగడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. ట్యూనా చేపలో కూడా కొవ్వు ఆమ్లాలు ఒమేగా-3, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు తెల్లబడకుండా కాపాడుతాయి.

Before Marriage: పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?

ఆహారం జీర్ణమవడం లేదా.. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆయుర్వేద డ్రింక్‌తో సమస్యకి చెక్..?

Sore Throat: కొవిడ్‌ మొదటి లక్షణం గొంతునొప్పి.. తగ్గడానికి ఇంట్లో ఈ ఆయుర్వేద పద్ధతులు..?

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే