Before Marriage: పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?

Before Marriage: భారతదేశంలో అరేంజ్‌ మ్యారేజ్‌లకి ఎక్కువ విలువనిస్తారు. ఇందులో వధూవరుల జాతకాలు, కుటుంబ స్థితిగతులు, సంపాదన, అందం వంటి అనేక అంశాలను

Before Marriage: పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?
Before Marriage
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2022 | 12:20 PM

Before Marriage: భారతదేశంలో అరేంజ్‌ మ్యారేజ్‌లకి ఎక్కువ విలువనిస్తారు. ఇందులో వధూవరుల జాతకాలు, కుటుంబ స్థితిగతులు, సంపాదన, అందం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ ముఖ్యమైన ఒక విషయాన్ని మాత్రం మరిచిపోతారు. ఇది వివాహానికి ముందు చేయవలసిన మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష. ఆధునిక కాలంలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే వివాహం తర్వాత వచ్చే సమస్యలను నివారించవచ్చు.ఎవరినైనా మీ జీవిత భాగస్వామిగా చేసుకునే ముందు ఈ నాలుగు వైద్య పరీక్షలు చాలా ముఖ్యం. ఇది మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తులో శారీరక సమస్యలను నివారించవచ్చని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

1. జన్యు వ్యాధి పరీక్ష (Genetic disease testing)

పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామి జన్యు వ్యాధి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే వారికి ఏమైనా జన్యుపరమైన వ్యాధులు ఉంటే అది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. జన్యుపరమైన వ్యాధులలో మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్ మొదలైనవి ఉంటాయి.

2. బ్లడ్ గ్రూప్ అనుకూలత పరీక్ష (Blood group compatibility test)

పెళ్లికి ముందు బ్లడ్ గ్రూప్ పరీక్ష కూడా చేయించుకోవాలి. భాగస్వాములిద్దరి బ్లడ్ గ్రూప్ అనుకూలంగా ఉంటే గర్భధారణ సమయంలో మహిళలను వివిధ సమస్యల నుంచి కాపాడవచ్చు.

3. వంధ్యత్వ పరీక్ష (Infertility test)

పెళ్లికి ముందు వ్యంధత్వ పరీక్ష కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ విషయం సంతానానికి సంబంధించినది. ఈ పరీక్ష ద్వారా పురుషుల స్పెర్మ్ కౌంట్, స్త్రీల అండాశయ ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. ఇది బేబీ ప్లానింగ్‌లో, మెరుగైన శారీరక సంబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.

4. లైంగికంగా సంక్రమించిన వ్యాధి పరీక్ష (Sexually transmitted disease test)

కొంతమంది వివాహానికి ముందు లైంగిక సంబంధాలను కలిగి ఉంటారు. దీంతో HIV AIDS, గోనేరియా, హెర్పెస్, సిఫిలిస్, హెపటైటిస్ సి వంటి వ్యాధుల ప్రమాదం ఉంటుంది. అందుకే లైంగికంగా సంక్రమించే వ్యాధి పరీక్ష (STDs టెస్ట్) చేయించుకోవడం తప్పనిసరి. లేదంటే వివాహం తర్వాత ఈ వ్యాధులు మీ జీవిత భాగస్వామికి సోకే ప్రమాదం ఉంటుంది.

ఆహారం జీర్ణమవడం లేదా.. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆయుర్వేద డ్రింక్‌తో సమస్యకి చెక్..?

Sore Throat: కొవిడ్‌ మొదటి లక్షణం గొంతునొప్పి.. తగ్గడానికి ఇంట్లో ఈ ఆయుర్వేద పద్ధతులు..?

Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్‌ కంట్రోల్‌.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!