AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sore Throat: కొవిడ్‌ మొదటి లక్షణం గొంతునొప్పి.. తగ్గడానికి ఇంట్లో ఈ ఆయుర్వేద పద్ధతులు..?

Sore Throat: జలుబు, దగ్గు కారణంగా చాలా సార్లు గొంతు నొప్పి వస్తుంది. దీనిని ఎదుర్కోవడం చాలా కష్టం. సీజన్ మారినప్పుడల్లా ఈ సమస్య ఎదురవుతుంది.

Sore Throat: కొవిడ్‌ మొదటి లక్షణం గొంతునొప్పి.. తగ్గడానికి ఇంట్లో ఈ ఆయుర్వేద పద్ధతులు..?
Sore Throat
uppula Raju
|

Updated on: Feb 11, 2022 | 10:45 AM

Share

Sore Throat: జలుబు, దగ్గు కారణంగా చాలా సార్లు గొంతు నొప్పి వస్తుంది. దీనిని ఎదుర్కోవడం చాలా కష్టం. సీజన్ మారినప్పుడల్లా ఈ సమస్య ఎదురవుతుంది. కొవిడ్‌ లక్షణాలలో గొంతునొప్పి మొదటిది. దీనిని ఇంట్లో కొన్ని ఆయుర్వేద పద్దతుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇందులో నల్ల మిరియాలు, తేనె, అల్లం, ఆపిల్ సైడర్ వెనిగర్, లిక్కోరైస్, పసుపు, ఉసిరి, లవంగం వంటి వాటిని ఉపయోగిస్తారు. అయితే వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.

1. ఉప్పు నీటితో పుక్కిలించు

ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కొంచెం నీటిని వేడి చేసి ఒక గ్లాసులో పోయాలి. అందులో టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక సిప్ ఉప్పునీరు తీసుకుంటూ 10 సెకన్ల పాటు పుక్కిలించండి. రోజుకు 2-3 సార్లు చేస్తే గొంతునొప్పి తగ్గుతుంది.

2. నల్ల మిరియాలు, తేనె

నల్లమిరియాలు, తేనె మిశ్రమం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఒక మంచి చిట్కా. ఇది గొంతు నొప్పి, జలుబు, దగ్గు చికిత్సకు ఉపయోగిస్తారు. తేనెలో సహజమైన గుణాలు ఉంటాయి. ఇది దగ్గును అణిచివేస్తుంది. మీకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మిరియాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

3. అల్లం

అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇందులో శక్తివంతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. 1 అంగుళం అల్లం బాగా తురిమి ఒక బాణలిలో వేయాలి. అందులో 1 గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. సుమారు 5 నిమిషాలు తర్వాత అల్లం నీటిని వడకట్టి తాగాలి.

4. ఆపిల్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 1 గ్లాసు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. చల్లారాక పరగడుపున తాగాలి.

5. ములేతి

ములేతి అనేది యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న హెర్బల్ రెమెడీ. ఇది గొంతు నొప్పి మాత్రమే కాకుండా అజీర్ణం, మలబద్ధకం, కడుపు పూతలకి చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్‌ కంట్రోల్‌.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?

Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్‌ కంట్రోల్‌.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?

IND vs WI 3rd ODI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే.. జట్టులో స్వల్ప మార్పులు..