Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు గమనిక.. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.!

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు మందులు తీసుకోవడమే కాకుండా తమ ఆహారపు అలవాట్లలో...

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు గమనిక.. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.!
Diabetics
Follow us

|

Updated on: Feb 10, 2022 | 10:04 PM

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు మందులు తీసుకోవడమే కాకుండా తమ ఆహారపు అలవాట్లలో పలు మార్పులు చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చన్నారు. డయాబెటిక్ రోగులకు ఆకలి వేయడం, గొంతు తడి ఆరిపోవడం, తరచూ మూత్ర విసర్జన సమస్య లాంటివి తలెత్తుతాయి. వీటి వల్ల వారికి సరిగ్గా నిద్రపట్టదు. దీనితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే నిద్రపోయే ముందు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇవి పాటిస్తే ఖచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..

నిద్రపోయే ముందు ఏమి తినాలి:

డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య బాగా పెరుగుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. హార్మోన్లలో మార్పులు, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడం, నిద్రపోయే ముందు ఏదైనా ట్యాబ్లట్స్ తీసుకోవడం లేదా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్న తర్వాత నిద్రపోవడం వంటి అనేక కారణాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం కావొచ్చు. ఇక దాన్ని కంట్రోల్ చేసేందుకు మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రపోయే ముందు అధిక ఫైబర్, తక్కువ కొవ్వు ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అలాగే రాత్రివేళ మితంగా భోజనం చేయండి.

కెఫీన్‌కు దూరంగా ఉండండి:

నిద్రపోయే ముందు కొంతమందికి కాఫీ తాగడం అలవాటు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం రాత్రివేళ కాఫీ, చాక్లెట్, సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. కెఫీన్‌తో కూడిన ఆహార పదార్ధాలు మెదడును ఉత్తేజపరుస్తాయి. కెఫీన్ మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. అలాగే డయాబెటిక్ రోగులు ఆల్కహాల్‌కు కూడా దూరంగా ఉండండి.

వాకింగ్‌కు వెళ్లండి:

రాత్రి భోజనం అనంతరం డయాబెటిక్ పేషెంట్స్ కాస్త వాకింగ్‌కు వెళ్లండి. మీ బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం, పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల మీకు సరిగ్గా నిద్రపడుతుంది. ఒకవేళ వ్యాయామం చేయలేకపోతే.. వాకింగ్‌కు వెళ్లండి.

నిద్రపోయే ముందు ఈ విషయాలు గుర్తించుకోండి:

నిద్రపోయే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మొబైల్‌ను పూర్తిగా సైలెంట్‌లో పెట్టుకుని మీరు రిలాక్స్ అవ్వండి. తద్వారా మీకు మంచి నిద్ర పడుతుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.