Aluminum: అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా? అయితే..ఈ స్టోరీ మీ కోసమే!
ఇప్పటికీ అల్యూమినియం గిన్నెలు.. వంట పాత్రలను చాలా ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. ఈ లోహపు పాత్రలలో ఆహారాన్ని వండే పద్ధతి చాలా చోట్ల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Aluminum: ఇప్పటికీ అల్యూమినియం గిన్నెలు.. వంట పాత్రలను చాలా ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. ఈ లోహపు పాత్రలలో ఆహారాన్ని వండే పద్ధతి చాలా చోట్ల ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీటిని ఉపయోగించడం వలన ఆరోగ్య(Health) సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బదులుగా ఇనుము .. మట్టి పాత్రలలో ఆహారాన్ని ఉడికించడం ఉత్తమ మార్గం అని నిపుణులు((Experts) చెబుతున్నారు. పూర్వకాలంలో ఖైదీలకు అల్యూమినియం పాత్రల్లోనే ఆహారం ఇచ్చేవారు, ఎందుకంటే అల్యూమినియం పాత్రల్లో తింటే వారి శరీరం, మనస్సు బలహీనపడతాయి. చౌకగా ఉండటంతో, ఈ మెటల్ పాత్రలు పేద ఇళ్లలో ఉపయోగిస్తూ వస్తున్నారు. అధ్యయనాల ప్రకారం, శరీరంలో అల్యూమినియం ఎక్కువగా ఉంటే జ్ఞాపకశక్తిపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ మెటల్ పరిశ్రమకు సంబంధించిన కార్మికులపై నిర్వహించిన అధ్యయనంలో దీనిని కనుగొన్నారు.
అల్యూమినియం పాత్రలను తయారు చేస్తున్నప్పుడు, అనేక ఇతర లోహాలు కూడా అందులో కలుపుతారు. ఇందులో ఉండే భారీ లోహాలు శరీరంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ లోహపు పాత్రలో వండిన ఆహారాన్ని నిలువ చేయడం కూడా తప్పు. పరిశోధన ఇంకా క్యాన్సర్‌తో ప్రత్యక్ష సంబంధాన్ని కనుగొననప్పటికీ, ఇతర ఎంపికలు ఉన్నప్పుడు అల్యూమినియం పాత్రలకు దూరంగా ఉండాలి.
కొన్ని పరిశోధనల్లో అల్యూమినియం మెదడుపై చెడు ప్రభావం చూపుతుందని తేలింది. దీని కారణంగా, పిల్లలు డైస్లెక్సియా.. ఆటిజం సమస్యలకు ఎక్కువగా గురవుతారు.. వారి ప్రవర్తన, పనులలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆహార పదార్ధాలు ఉడికించడానికి ఏ పాత్రలు మంచివి?
మానవ శరీరం ఐదు మూలకాలతో రూపొందిండి. ఈ మూలకాలలో ఒకటి మట్టి. మట్టి కుండలలో తినడం వల్ల మనిషికి ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది. నేల పూర్తిగా సహజమైనది.
దక్షిణ భారతదేశంలో, శరీరానికి మేలు చేసే ఇడ్లీ-దోసను తయారు చేసేందుకు మట్టి కుండలలో కిణ్వ ప్రక్రియ చేస్తారు.
అల్యూమినియం పాత్రలకు బదులుగా, ఆకుపచ్చ కూరగాయలను వండడానికి ఇనుప స్కిల్లెట్ ఉపయోగించాలి. ఇనుప పాత్రలో ఉడికించిన తర్వాత మరో పాత్రలో దీనిని తీసిపెట్టుకోవాలి.
ఇవి కూడా చదవండి: Bath Salt: బాత్‌సాల్ట్ తో స్నానం..అలసట మటుమాయం..ఎలాగంటే..
Banana Tips: అరటి పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ పాటించండి, చాలా కాలం ఫ్రెష్‌గా ఉంటాయి..