Honey Side Effects: రోగనిరోధక శక్తి అంటూ రోజూ తేనెను ఎక్కువగా తీసుకుంటున్నారా .. తేనె వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటంటే..
Honey Side Effects: తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్(Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి (Immunity)పేరుతో..
Honey Side Effects: తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తేనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్(Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి (Immunity)పేరుతో ఆహారం పట్ల శ్రద్ధ పెరిగింది. దీంతో తేనె ను అధిక మొత్తంలో ఉపయోగించే వారి సంఖ్య కూడా అధికమయ్యింది. అయితే తేనె సహజమైన తియ్యని గుణాన్ని కలిగి ఉంది. తేనెను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. తేనెలో గ్లూకోజ్, విటమిన్లు, ఖనిజాలు , అమైనో ఆమ్లాలు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ కదా అంటూ.. తేనెను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి కూడా ఆరోగ్యానికి హానికరం. తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే తేనెను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అంతే కాకుండా తలనొప్పి, కడుపులో గ్యాస్ ఏర్పడటం, ఆకలి మందగించడం, బలహీనత, వికారం వంటి సమస్యలు కూడా రావచ్చు. అందువల్ల, అవసరమైన దానికంటే ఎక్కువ తేనెను తీసుకునే అలవాటుని మానుకోమంటున్నారు.
ఇమ్యునిటీ కోసం చాలా మంది తేనె ఎక్కువగా తీసుకుంటున్నవారు ఈ ఐదు నష్టాల గురించి తెసుకొండి.
1. ఊబకాయం: బరువు తగ్గడానికి తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఎక్కువుగా తేనెను వినియోగిస్తే బరువు పెరగడానికి కరనమవ్జుతుంది. చక్కెర కంటే తేనె మంచిదే కానీ..అయితే తేనెలో కూడా తీపి కూడా ఉంటుంది. 1 టీస్పూన్ తేనెలో 64 కేలరీలు ఉంటాయి, ఇవి మీ బరువును పెరిగేలా చేస్తాయి.
2. దంతాలు: తేనెలో ఉండే తీపి నోటిలోని బ్యాక్టీరియాకు ఆహారం, ఇది నోటిలో బ్యాక్టీరియాను అధిక మయ్యేలా చేస్తుంది. దీంతో దంతాలు దెబ్బతింటాయి.
3. బ్లడ్ షుగర్: తేనెను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది, ఇది ఇన్సులిన్ ద్వారా విచ్ఛిన్నం కాదు కనుక తేనె రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
4. జీర్ణక్రియ: తేనెను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, కడుపు నొప్పి తో పాటు కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. కనుక కడుపు జీర్ణ క్రియ సరిగ్గా ఉండాలంటే పరిమిత పరిమాణంలో తేనె తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
5. అలర్జీలు: కొందరికి తేనె అంటే ఎలర్జీ ఉండవచ్చు. కనుక తేనె ఉపయోగించే ముందు అలెర్జీ లేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తేనె అంటే అలర్జీ ఉన్నవారు తేనె వినియోగానికి దూరంగా ఉండాలి.
note: మేము సాధారణ పాఠకుని ఆసక్తిని అనుసరించి, సలహాతో కూడిన సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాము. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read: గుంటూరులో హైడ్రామా.. దేవినేని ఉమ పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..