Devineni Uma: గుంటూరులో హైడ్రామా.. దేవినేని ఉమ పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..
Devineni Uma: టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవి నేని ఉమామహేశ్వరరావు ఈరోజు ఉదయం గుంటూరు(Guntur)లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి అరెస్ట్ చేసిన టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు..
Devineni Uma: టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు ఉదయం గుంటూరు(Guntur)లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి అరెస్ట్ చేసిన టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు(TDP MLC Ashokbabu)ను కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమహంలో ఉమ సహా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన టిడిపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడం కోసం దేవినేని ఉమ సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తి వంటి నేతలతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు వెళ్ళారు. అయితే సీఐడీ ఆఫీసులోకి వెళ్తున్న పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ఉమా మండిపడ్డారు. పోలీసులు వెంటనే ఉమా పాటు ఇతర నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. అర్ధరాత్రి అశోక్ బాబుని అరెస్ట్ చేశారని అన్నారు. ఆయనపై పోలీసులు తప్పుడు కేసులను పెట్టి వేధిస్తున్నారు.. దాడి చేస్తారా అంటూ పోలీసులను నిలదీశారు. అంతేకాదు అశోక్ బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే అనుమానం కలుగుతుందని ఉమా వ్యాఖ్యానించారు. అశోక్‌బాబు ఎటువంటి తప్పు చేయలేదు.. అందుకనే ముందస్తు బెయిల్ తీసుకోలేదన్నారు. అనవసరంగా అశోక్ బాబుని అరెస్టులు చేసి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు. ఇదే విధంగా గతంలో పోలీసులు ఎంపీ రఘురామక్రిష్ణరాజుని కూడా కొట్టారని ఈ సందర్భంగా ఉమ గుర్తు చేశారు.
Also Read: