Iran crime news: భార్య తల నరికి.. తలను చేత్తో పట్టుకుని.. వీధుల్లో తిరుగుతూ రాక్షసత్వం

Iran crime news: భార్య తల నరికి.. తలను చేత్తో పట్టుకుని.. వీధుల్లో తిరుగుతూ రాక్షసత్వం
Iran Wife Murder

తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆగ్రహించిన భర్త.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. దేశం దాటి తలదాచుకున్నా..

Ganesh Mudavath

|

Feb 11, 2022 | 11:14 AM

తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఆగ్రహించిన భర్త.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. దేశం దాటి తలదాచుకున్నా.. అక్కడికీ వచ్చాడు. బలవంతంగా స్వదేశానికి తీసుకువచ్చి తన తమ్ముడితో కలిసి తల నరికి హత్య చేశాడు. అంతే కాకుండా తలను చేతితో పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కలకలం సృష్టించాడు. కాగా మృతురాలి వయసు 17 ఏళ్లే కావడం, అప్పటికే ఆమెకు ఓ కుమారుడు ఉండటం గమనార్హం. ఇరాన్ లో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ డిమాండ్ చేస్తున్నారు.

ఇరాన్‌(Iran) లోని అహ్వాజ్‌లో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన కొన్నాళ్లపాటు వీరి వివాహ బంధం సజావుగానే సాగింది. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త గ్రహించాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. భర్తకు విషయం తెలిసిపోయిందని గ్రహించిన భార్య.. ఇరాన్ వదిలి టర్కీ(Turkey)కి వెళ్లిపోయింది. అయినప్పటికీ మహిళ తండ్రి, భర్త దేశం దాటి వివాహితను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. భార్య వివాహేతర సంబంధంతో భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంటి నుంచి పారిపోయి తన పరువు తసిందని మండిపడ్డాడు. చివరికి తన తమ్ముడితో కలిసి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు.

అంతటితో ఆగకుండా ఓ చేతిలో కత్తి, మరో చేతిలో భార్య తల పట్టుకొని రోడ్డు మీదకు వచ్చి భయోత్పాతం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. మృతురాలి భర్తతోపాటు అతని సోదరుడిని సోమవారం అరెస్టు చేశారు. ఈ ఊదంతంపై ఇరాన్‌ దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో దేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించిన మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంట్‌ను కోరింది.

కాగా ఇరాన్‌లో బాలికల వివాహ వయసు 13 ఏళ్లుగా నిర్ణయించారు. అంతేగాక బాధితురాలికి పెళ్లి అయినప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు కావడం గమనార్హం.

ఇవీ చదవండి.

Telangana: పెళ్లి ముహూర్తానికి మూడు గంటలే సమయం.. అంతలోనే తీవ్ర విషాదం

Aghora Hulchul: విశాఖలో రోడ్లమీద తిరుగుతూ అఘోరా బీభత్సం.. గంజాయి సేవించి వీరంగం

War bells: అటు రష్యా.. ఇటు అమెరికా.. మధ్యలో ఉక్రెయిన్.. మోగుతున్న యుద్ధ ఘంటికలు!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu