ఏళ్లుగా పెనవేసుకున్న కులవివక్ష.. బార్బర్ షాపుల్లోకి దళితులకు నో ఎంట్రీ.. కోర్టు ఆగ్రహం
సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆధునికతలో దూసుకుపోతున్నా.. మారుమూల ప్రాంతాల్లో కులవివక్ష రాజ్యమేలుతూనే ఉంది....
సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆధునికతలో దూసుకుపోతున్నా.. మారుమూల ప్రాంతాల్లో కులవివక్ష రాజ్యమేలుతూనే ఉంది. రాజ్యాంగం ప్రకారం కులాలు, మతాలు అన్నీ సమానమేనని ప్రభుత్వం చెబుతున్నా వారిలో మార్పు రావడం లేదు. దళితులు, అగ్రవర్ణాలు అంటూ తేడాలు చూపిస్తున్నారు. తాజాగా తమిళనాడులో కులవివక్ష సంచలనంగా మారింది. ఓ గ్రామంలోని బార్బర్ షాపుల్లో దళితులకు అనుమతి నిరాకరించారు అగ్రవర్ణాల వారు. దీనిపై ఏళ్లుగా పోరాటం చేసినా వారి ఉద్యమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇక విధిలేని పరిస్థితుల్లో మధురై బెంచ్ ను ఆశ్రయించారు. దళిత సంఘాలు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడులో (Tamilnadu) ని పుదుకోట్టై జిల్లాలో పుథుపట్టి గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 200 దళిత కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామంలో మూడు సెలూన్ షాపులు ఉండగా.. అందులోకి అగ్రవర్ణాల వారు మాత్రమే రావాలి. హెయిర్ కటింగ్(Hair cutting) కు దళితులకు అనుమతి లేదు. వారు కటింగ్ కు వస్తే అగ్ర వర్ణాలవారు ఒప్పుకోరు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కులవివక్ష ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ.. న్యాయం జరగకపోవడంతో చేసేదేమి లేక హెయిర్ కటింగ్ కోసం సమీప గ్రామాలకు వెళుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఆఖరికి టీ షాపులోనూ వివక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుల వివక్ష వేధింపులు ఎక్కువ అవడంతో ఇక భరించలేక మద్రాస్ కోర్టు మధురై బెంచ్ ను ఆశ్రయించారు. మధురై న్యాయస్థానంలో సెల్వం అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఘటన వివరాలు తెలుసుకుని బాధ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి.
Before Marriage: పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?
Devineni Uma: గుంటూరులో హైడ్రామా.. దేవినేని ఉమ పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు..
TS SSC Exam Date: తెలంగాణ పదో తరగతి పరీక్ష షెడ్యూల్ ఖరారు..?