Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలాల్లో నగ్నంగా పదేళ్ల బాలుడి మృతదేహం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

లైంగిక దాడికి పాల్పడే వారు వావీ వరసలు మర్చిపోతున్నారు. లింగ బేధంతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పకడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని..

పొలాల్లో నగ్నంగా పదేళ్ల బాలుడి మృతదేహం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Boy Rape
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 11, 2022 | 1:06 PM

లైంగిక దాడికి పాల్పడే వారు వావీ వరసలు మర్చిపోతున్నారు. లింగ బేధంతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పకడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో పదేళ్ల బాలుడిపై కామాంధులు విరుచుకుపడ్డారు. అఘాయిత్యానికి పాల్పడి, బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని​కాన్పూర్ అవుటర్​పరిధిలో ఓ రైతు కుటుంబం నివాసముంటోంది. అతని కుమారుడు ఆడుకుంటానని చెప్పి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా వెతికారు. అయినా ఆచూకీ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మంగళవారం ఉదయం నుంచి పిల్లవాడి కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఊరి బయట ఉన్న పొలాల్లో ఓ బాలుడి మృతదేహాన్ని పనులకు వెళ్లిన కూలీలు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా.. కనిపించకుండా పోయిన చిన్నారి మృతదేహమని తేలింది. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి మృతదేహంపై దుస్తులు లేవు. దుస్తులు యాభై మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. ఘాతుకానికి పాల్పడే సమయంలో ప్రతిఘటించడంతో పిల్లాడిపై బండరాళ్లతో దాడి చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న వారిని ప్రశ్నిస్తున్నామని కాన్పూర్ ఏఎస్పీ ఆదిత్య కుమార్​ వెల్లడించారు.

ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసనలు చేశారరు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Also Read

White Hair: తెల్ల జుట్టుకి కారణం పోషకాహార లోపం.. డైట్‌లో ఈ ఆహారాలు ఉండాల్సిందే..?

Tollywood Drugs Cases: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడుగా ఈడీ.. మరో కీలక పరిణామం

కళ్లలోనే కోటి జలపాతాలు.. నవ్వితే కమ్ముతాయి వెన్నెల రాత్రులు..ఈ వయ్యారి ఎవరో గుర్తించారా