Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs Cases: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడుగా ఈడీ.. మరో కీలక పరిణామం

Hyderabad: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన అన్నిరికార్డులు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) లేఖ రాసింది.

Tollywood Drugs Cases: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడుగా ఈడీ.. మరో కీలక పరిణామం
Tollywood Drugs Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 11, 2022 | 12:13 PM

Telugu film industry :టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిసైడైంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate). కేసు వివరాల కోసం ఎక్సైజ్ శాఖకు మరోసారి ఈడీ లేఖ రాసింది. నిందితులు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వాలని లేఖలో కోరింది ఈడీ. వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఇప్పటికే హైకోర్ట్‌కు తెలిపింది. దీంతో కేసుకి సంబంధించి రికార్డులన్నీ ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేస్తే తమ వద్ద సమాచారం, పత్రాలు ఇవ్వాలని డ్రగ్స్ కేసులను విచారణ చేస్తున్న కోర్టులను కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. డ్రగ్స్ యువతను అతలాకుతలం చేస్తున్నాయని.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్​ఫోర్స్​ మెంట్ డైరెక్టరేట్​కు సహకరించాలని తెలిపింది. డ్రగ్స్ కేసు విచారణకు ఈడీ సరైన సంస్థేనని ధర్మాసనం అభిప్రాయపడింది.  దర్యాప్తునకు అవసరమైన వివరాలు, డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే.. మళ్లీ తమను సంప్రదించవచ్చునని ఈడీకి హైకోర్టు సూచించింది.  ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖకు మరోసారి ఈడీ లేఖ రాసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుతో పాటు డ్రగ్ పెడ్లర్ టోనీ వ్యవహారంపైనా ఈడీ ఫోకస్ పెట్టింది. నైజిరీయాకు టోనీ పెద్ద మొత్తంలో నిధులు మళ్లించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఆ వివరాలకు సంబంధించి కూపీ లాగే పనిలో పడింది. అలాగే టోనీ అనుచరులు, సహచరులతో పాటు వ్యాపారవేత్తల్ని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తోంది.

Also Read: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్

 ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ హీరోగా రచ్చ చేస్తున్నాడు.. ఎవరో గుర్తించారా..?