కళ్లలోనే కోటి జలపాతాలు.. నవ్వితే కమ్ముతాయి వెన్నెల రాత్రులు..ఈ వయ్యారి ఎవరో గుర్తించారా

కళ్లలోనే కోటి జలపాతాలు.. నవ్వితే కమ్ముతాయి వెన్నెల రాత్రులు..ఈ వయ్యారి ఎవరో గుర్తించారా

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ కు కొదవే లేదు.. చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా తమ అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ముద్దుగుమ్మలు

Rajeev Rayala

|

Feb 11, 2022 | 11:40 AM

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్‌కు కొదవే లేదు.. చిన్న సినిమాలైనా.. పెద్ద సినిమాలైనా తమ అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ముద్దుగుమ్మలు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంటున్నారు. గ్లామర్ షోతోనే కాకుండా.. డాన్స్ లతో.. నటనతో ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న వయ్యారి భామ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ చేప కళ్ళ సుందరి ఎవరో గుర్తుపట్టారా..? అక్కినేని ఫ్యామిలీ హీరో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ దూకుడు మీద ఉంది. ఇప్పటికైనా ఈ చిన్నది ఎవరో కనిపెట్టారా..? ఈ అమ్మడు ఎవరంటే..

అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో నటించిన మీనాక్షి చౌదరి. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది మీనాక్షి. చూడటానికి అచ్చం పక్కింటి అమ్మాయిల కనిపించే మీనాక్షి కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ వరుస ఆఫర్లను అందుకుంటోంది. రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది మీనాక్షి. ఈ సినిమా నేడు (గురువారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటల్లో మీనాక్షి తన అందంతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఖిలాడి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. అంతే కాదు ఈ సినిమాలో పెదవి ముద్దులతో రెచ్చిపోయింది ఈ చిన్నది. ఖిలాడి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో మీనాక్షి చౌదరికి మరిన్ని బడా మూవీ ఆఫర్లు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మరి ఈ అమ్మడు ఎలా రాణిస్తుందో చూడాలి.

Meenakshi

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu