AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi Twitter Review: యాక్షన్ ప్యాక్డ్ మాస్ హిట్ అంటున్నారుగా.. ఖిలాడి ట్విట్టర్ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 11న )ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Khiladi Twitter Review: యాక్షన్ ప్యాక్డ్ మాస్ హిట్ అంటున్నారుగా.. ఖిలాడి ట్విట్టర్ రివ్యూ
Raviteja
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2022 | 10:45 AM

Share

Khiladi Twitter Review:  మాస్ మహారాజా రవితేజ(Raviteja )హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ(RameshVarma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 11న )ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత రవితేజ నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమా కంటే ముందు క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. ఇప్పుడు అదే జోష్ లో ఖిలాడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి(DimpleHayathi) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా రవితేజ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారని అంటున్నారు ప్రేక్షకులు.

ఖిలాడిలో అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. . సచిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి, రావు రమేశ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా పై ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా రివ్యూలను అందిస్తున్నారు. దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని అంటున్నారు. అలాగే ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జిటిక్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్స్ కూడా తమ నటనతో ప్రేక్షకులను అలరించారని తెలుస్తుంది. దర్శకుడు రమేష్ వర్మ సినిమాను చక్కగా ప్రజెంట్ చేశారని ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు.. మొత్తంగా ఖిలాడితో మాస్ రాజా మరో హిట్ కొట్టినట్టే కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై