AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పెళ్లి ముహూర్తానికి మూడు గంటలే సమయం.. అంతలోనే తీవ్ర విషాదం

Telangana: కేవలం మూడు గంటల్లో వివాహం జరగాల్సిన ఆ కుబుంబంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడిడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు...

Telangana: పెళ్లి ముహూర్తానికి మూడు గంటలే సమయం.. అంతలోనే తీవ్ర విషాదం
Follow us
Subhash Goud

|

Updated on: Feb 11, 2022 | 10:38 AM

Telangana: కేవలం మూడు గంటల్లో వివాహం జరగాల్సిన ఆ కుబుంబంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. మూడు గంటల్లోనే వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి కుమారుడు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీకొనడంతో వరుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది.  జడ్చర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ పట్టణం క్రిష్టియన్‌పల్లికి చెందిన భవనాల చైతన్య కుమార్‌ (35) కొన్నేళ్లుగా నారాయణపేట జిల్లాలోని తిర్మలాపూర్‌ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.

కాగా, చైతన్యకు ఇటీవల వనపర్తి జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకు చర్చిలో పెళ్లి జరగాల్సి ఉంది. ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఉదయం 8 గంటలకు వరుడు చైతన్య కుమార్‌ ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా కారులో జడ్చర్లకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్న నక్కలబండ తండా మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొంది. దీంతో చైతన్య కుమార్‌ తలకు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన వరుడి కుటుండంతో పాటు వధువు కుటుంబంలోనూ తీవ్ర విషాదం నింపింది. ఉన్న ఒక్కనొక కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Telangana Crime: ‘అంకుల్‌ నాన్న లేవడం లేదు..’ పక్కింటి వారికి చిన్నారుల ఫోన్.. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు.. ముగ్గురు దర్మరణం