War bells: అటు రష్యా.. ఇటు అమెరికా.. మధ్యలో ఉక్రెయిన్.. మోగుతున్న యుద్ధ ఘంటికలు!
రష్యా .. నాటో దళాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా(America) అధ్యక్షుడు జో బిడెన్ తన పౌరులను వెంటనే ఉక్రెయిన్ విడిచిపెట్టాలని కోరేంత స్థాయికి పరిస్థితి మరింత దిగజారింది.
War bells: రష్యా .. నాటో దళాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా(America) అధ్యక్షుడు జో బిడెన్ తన పౌరులను వెంటనే ఉక్రెయిన్ విడిచిపెట్టాలని కోరేంత స్థాయికి పరిస్థితి మరింత దిగజారింది. ఎన్‌బిసి న్యూస్‌తో మాట్లాడుతూ, యుఎస్ .. రష్యా మిలిటరీ మధ్య ఎప్పుడైనా ప్రత్యక్ష పోరాటం ప్రారంభమవుతుందని బిడెన్(Joe Biden) చెప్పారు. ”మేము ప్రపంచంలోని అతిపెద్ద సైన్యాలలో ఒకదానితో ఘర్షణ స్థితిలో ఉన్నాము. ఇది చాలా భిన్నమైన పరిస్థితి, త్వరలో పరిస్థితులు మరింత దిగజారవచ్చు. US పౌరులు త్వరలో ఉక్రెయిన్‌ను విడిచిపెట్టాలి.” అని బిడెన్ అన్నారు. అదేవిధంగా ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపే ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జవాబిస్తూ . అక్కడికి సైన్యాన్ని పంపడం అంటే ప్రపంచ యుద్ధానికి నాంది అని అర్థం అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ సలహాదారు గురువారం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తీసుకుంటే, అమెరికా తన పౌరులను ఖాళీ చేయగలిగే స్థితిలో ఉండదు అంటూ హెచ్చరించారు. అదే సమయంలో రష్యా సైన్యం పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభిస్తే కేవలం 48 గంటల్లోనే తమ ట్యాంకులు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి ప్రవేశిస్తాయని అమెరికన్ థింక్ ట్యాంక్ కూడా వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమెరికా తన పౌరులను వెంటనే ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చేయాలని పిలుపు నిచ్చింది. ఇది ప్రస్తుతం అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.
కసరత్తు ప్రారంభించిన రష్యా..
యుద్ధం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రష్యా కూడా సన్నాహాలు ప్రారంభించింది. రష్యా గురువారం బెలారసియన్ సైన్యంతో కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలి సంవత్సరాలలో ఇదే అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసం. ట్యాంకులు, యుద్ధ విమానాలు, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు వేలాది మంది సైనికులు ఇందులో పాల్గొంటున్నారు. బెలారస్‌లో, ఈ వ్యాయామం ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. నివేదికల ప్రకారం, 30 వేలకు పైగా రష్యన్ సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు.
ఉక్రెయిన్‌కు అమెరికా రెండవ దఫా ఆయుధాల సరఫరా..
కాగా గత రాత్రి, ఉక్రేనియన్ సైన్యం అమెరికన్ ఆయుధాల రెండవ సరఫరాను అందుకుంది. కొన్ని రోజుల క్రితం, US $ 200 మిలియన్ల భద్రతా సహాయ ప్యాకేజీ మొదటి సరఫరాను ఉక్రెయిన్‌కు పంపింది. అంతేకాకుండా బ్రిటన్ కూడా అత్యాధునిక క్షిపణులను అందజేసింది. రష్యా నుంచి వచ్చే దాడిని ఎదుర్కోవడానికి, బ్రిటన్ పెద్ద సంఖ్యలో అత్యాధునిక ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను .. ఆంగ్లో-స్వీడిష్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను అందజేసింది. ఈ నేపధ్యంలో రష్యా, అమెరికాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read: Prince Charles: ప్రిన్స్ ఛార్లెస్‌కు రెండోసారి కరోనా.. ఐసోలేషన్‌లోకి బ్రిటన్ యువరాజు..
Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం..