Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం..

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని (Peru) లిబర్టాడ్‌ రీజియన్‌లో ఓ బస్సు రోడ్డుపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదం (Bus Accident) లో సుమారు 20 మంది మృతిచెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు

Bus Accident: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం..
Peru Road Accident
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2022 | 9:10 AM

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని (Peru) లిబర్టాడ్‌ రీజియన్‌లో ఓ బస్సు రోడ్డుపై నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదం (Bus Accident) లో సుమారు 20 మంది మృతిచెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పెరూ అధికారులు చెబుతున్నారు. కాగా బస్సు తయాబాంబా నుంచి ట్రుజిల్లోకు ప్రయాణిస్తోండగా ఈ దుర్ఘటన జరిగిందని, సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లిందని పేర్కొన్నారు. ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జయిందని, నాలుగేళ్ల చిన్నారితో సహా సహా 20 మంది సంఘటనా స్థలంలో మరణించారని అధికారులు చెబుతున్నారు.

గతంలోనూ..

కాగా అధ్వాన్నమైన రోడ్లు, అధిక వేగం, ప్రమాద సూచికలు లేకపోవడం, అధికారులు నిబంధనలను అమలు చేయక పోవడం వల్ల పెరూలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది నవంబర్ 10న ఉత్తర పెరూవియన్ జంగిల్‌లో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. ఓ మినీబస్సు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రస్తుతం బస్సు ప్రమాదానికి కూడా అధ్వాన్న రహదారులే కారణమంటున్నారు. 340 కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి రోడ్ల అధ్వాన్న స్థితి కారణంగా 14 గంటల సమయం పట్టిందని, ఈ సమయంలోనే బస్సు ప్రమాదానికి గురైందని బాధితులు చెబుతున్నారు.

Also Read:Chandrababu Naidu: ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం.. జగన్‌ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిక..

Anantapur: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చెరువులోకి దూకిన చైన్‌ స్నాచర్‌.. ఆతర్వాత ఏమైందంటే..

Rajinikanth: సెన్సేషనల్‌ డైరెక్టర్‌తో కొత్త సినిమాను షురూ చేసిన తలైవా.. 169వ సినిమా అఫీషియల్‌..