Rajinikanth: సెన్సేషనల్‌ డైరెక్టర్‌తో కొత్త సినిమాను షురూ చేసిన తలైవా.. 169వ సినిమా అఫీషియల్‌..

'అన్నాత్తై' (తెలుగులో పెద్దన్న) తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) తన కొత్త సినిమాను పట్టాలెక్కించారు. శివకార్తికేయన్‌తో 'డాక్టర్‌' (Doctor)

Rajinikanth: సెన్సేషనల్‌ డైరెక్టర్‌తో కొత్త సినిమాను షురూ చేసిన తలైవా.. 169వ సినిమా అఫీషియల్‌..
Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2022 | 11:30 AM

‘అన్నాత్తై’ (తెలుగులో పెద్దన్న) తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) తన కొత్త సినిమాను పట్టాలెక్కించారు. శివకార్తికేయన్‌తో ‘డాక్టర్‌’ (Doctor) వంటి సూపర్‌ హిట్‌ సినిమాను తెరకెక్కించిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dileep Kumar)  తో తన కొత్త చిత్రాన్ని షురూ చేశారు. ఈమేరకు రజనీకాంత్‌- నెల్సన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో తలైవా రజనీకాంత్‌, డైరెక్టర్‌ నెల్సన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

కాగా తమిళనాట విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. నయనతారతో లో బడ్జెట్‌లో నిర్మించిన ‘కొలమావు కోకిల’ సూపర్ హిట్‌ గా నిలిచింది. ఇటీవల శివకార్తికేయన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘డాక్టర్’ సినిమా ఏకంగా100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో కలిసి ‘బీస్ట్‌’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో నెల్సన్‌ను పిలిచి మరీ రజనీకాంత్‌ అవకాశం ఇచ్చారని సమాచారం. కాగా ‘అన్నాత్తై’తో కమర్షియల్‌గా హిట్‌ కొట్టినా, తన రేంజ్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు తలైవా. ఈ క్రమంలో నెల్సన్‌తోనైనా భారీ విజయాన్ని తలైవా సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.