Aadavallu Meeku Joharlu: ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆడవాళ్ళు మీకు జోహార్లు.. ఆకట్టుకుంటున్న టీజర్
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఈ వేసవిలో విడుదల కాబోతున్న చిత్రాల్లో ఆడవాళ్ళు మీకు జోహార్లు ఒకటి.
Aadavallu Meeku Joharlu: యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్(Sharwanand ) నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ వేసవిలో విడుదల కాబోతున్న చిత్రాల్లో ఆడవాళ్ళు మీకు జోహార్లు ఒకటి. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రం నాన్-థియేట్రికల్ హక్కులు మేకర్స్‌కు భారీ ఆఫర్ తెచ్చిపెట్టాయి, ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు టీజర్ వచ్చేసింది. ప్రధాన పాత్రలందరినీ పరిచయం చేయడంతో పాటు, సినిమా దేనికి సంబంధించినది అనేది వీడియోలో చూపించారు . పదిమంది ఆడవాళ్లు ఉన్న ఇంట్లో ఒక అమ్మాయిని ఓకే చేయడం నరకం అంటూ శర్వానంద్ వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది.
తన కుటుంబంలోని 10 మంది మహిళా సభ్యుల అంగీకారం పొందడం అంత సులభం కాదు. కాబట్టి, పెళ్లికి సరైన అమ్మాయిని వెతకడం అతనికి చాలా కష్టమనిపిస్తుంది. అదే సమయంలో రష్మిక హీరోకి పరిచయం అవుతుంది. అయితే, కథలో ట్విస్ట్ ఏమిటంటే, మన పెళ్లి జరగదు అని హీరోయిన్ చెప్పడం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. తిరుమల కిషోర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వర్కబుల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నాడని టీజర్ చూస్తే అర్శమవుతుంది. ఇందులో శర్వానంద్, రష్మిక మందన్న కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సుజిత్ సారంగ్ కెమెరా పనితనం ఆకర్షణీయంగా వుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ టీజర్‌కు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అనేది అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అర్ధమవుతుంది. ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు ఫిబ్రవరి 25నే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :