Kajal Aggarwal: టాలీవుడ్ చందమామపై ట్రోలింగ్.. స్పందించిన సెలబ్రిటీలు..
టాలీవుడ్ చందమామా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
టాలీవుడ్ చందమామా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భం (Pregnancy) తో ఉంది. కాగా ఇటీవల తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్ బాడీ షేమింగ్ (Body Shaming) కు గురైన సంగతి తెలిసిందే. ఈ ఫొటోల్లో బేబీబంప్‌తో బొద్దుగా కనిపించిన కాజల్ శరీరాకృతిని విమర్శిస్తూ కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అయితే చందమామ కూడా వాటికి ధీటుగా బదులిచ్చింది. తనపై అసభ్య కామెంట్స్ చేసిన నెటిజన్లకు తగిన బుద్ధి చెప్పింది. ‘నా జీవితంలో, నా శరీరంలో, ఇంట్లో, పని ప్రదేశంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి, వాటన్నింటినీ ఆస్వాదిస్తున్నాను. ఇలాంటి సమయంలో బాడీ షేమింగ్ కామెంట్లు, మీమ్స్ వల్ల నాకు కానీ, మీకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. కష్టంగా అనిపించినా సరే కానీ ముందు దయతో ఎలా మెదలాలో నేర్చుకోండి. మీరు బతకండి, ఇతరులనూ బతకనివ్వండి’ అంటూ ట్రోలర్స్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేసింది.
నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావ్..
కాగా ట్రోలర్స్‌కు తనదైన శైలిలో సమాధానం చెప్పిన కాజల్‌పై పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు మద్దతు నిస్తూ లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ని నింపేస్తున్నారు. ‘నువ్వు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ అందంగానే ఉంటావ్’ అని లవ్ ఎమోజీతో సమంత (Samantha) స్పందించగా..’ నువ్వు ప్రతి దశలో పర్‌ఫెక్ట్, నీ చూట్టు చాలా ప్రేమ ఉంది బేబీ’ అని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కామెంట్ చేసింది. అలాగే రాశి ఖన్నా, హన్సిక సైతం కాజల్‌కు మద్దతునిస్తూ లవ్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఇలా సెలబ్రిటీల కామెంట్లపై స్పందించిన కాజల్ సోదరి నిషా అగర్వాల్ స్పందిస్తూ.. ‘నిజమే.. ఇంతకంటే మాటల్లో చెప్పలేం! మై గార్జియస్’ అంటూ రిప్లై ఇచ్చింది.
View this post on Instagram
Also read:Valimai Trailer: మహేష్ చేతులమీదుగా అజిత్ సినిమా వలిమై ట్రైలర్.. అదిరిందిగా
Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. అదిరిపోయే స్టేషన్.. ఫోటోలు షేర్ చేసిన మంత్రి