Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విద్యార్థినులను వేధించవద్దన్నందుకు.. ప్రిన్సిపాల్‌ను వెంటపడి కొట్టిన స్టూడెంట్స్

AP News: అమ్మాయిలను టీజ్ చేస్తూ.. ఇబ్బంది పెడుతున్న ఒక కాలేజీ విద్యార్థులను.. మరొక కాలేజీ ప్రిన్సిపాల్ మందలించారు. దీంతో కోప్పడ్డ విద్యార్థులు ప్రిన్సిపాల్‌ని వెంటపడి కర్రలతో చితకబాదారు.

Andhra Pradesh: విద్యార్థినులను వేధించవద్దన్నందుకు.. ప్రిన్సిపాల్‌ను వెంటపడి కొట్టిన స్టూడెంట్స్
Students Attack On Principal
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 11, 2022 | 11:20 AM

Prakasam District: ప్రకాశం జిల్లా అద్దంకి(Addanki)లో స్టూడెంట్‌ వార్ కామన్‌గా మారింది. మొన్న విశ్వభారతి కాలేజ్ విద్యార్థులు, రాయల్ కాలేజీ విద్యార్థులు కొట్టుకుంటే.. తాజాగా విశ్వభారతి విద్యార్థులు ఏకంగా చైతన్య కాలేజ్ ప్రిన్సిపాల్‌ని చావబాదారు. చైతన్య జూనియర్ కళాశాల(Chaitanya Junior College) విద్యార్థినులను విశ్వభారతి కాలేజ్‌ స్టూడెంట్స్ ఏడిపించారని, చైతన్య ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వాళ్లను మందలించారు. ఇంకోసారి ఇలా చేస్తే.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది నచ్చని విశ్వ భారతి జూనియర్ కళాశాల స్టూడెంట్స్ ఆయనపై దాడి చేశారు. విద్యార్దుల దాడిలో ప్రిన్సిపల్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కొందరు విద్యార్థులను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.  ఇదే అద్దంకిలో నాలుగురోజుల క్రితం విశ్వ భారతి జూనియర్ కాలేజీ, రాయల్ జూనియర్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విశ్వ భారతి జూనియర్ కళాశాలకు చెందిన ఓ విద్యార్దినిని… రాయల్ జూనియర్ కళాశాల విద్యార్థులు టీజ్ చెయ్యడంతో గొడవ మొదలైంది. దీంతో ఇరు కాలేజిలకు చెందిన విద్యార్దులు ఘర్షణకు దిగారు. ఓ విద్యార్దిని పట్టుకుని మిగిలిన విద్యార్దులు చితక్కొట్టారు. దీంతో సీఐ రాజేశ్, ఎస్సై లక్ష్మీభవాని స్టూడెంట్స్‌ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ ఘటన మరిచిపోకముందే విశ్వభారతి కాలేజి విద్యార్దులు చైతన్య కాలేజి విద్యార్దినులను టీజ్‌ చెయ్యడం, అది చివరికి ప్రిన్సిపల్‌పై దాడి దాకా వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది.

Also Read: సాధారణ వాహన తనిఖీలు.. కంగారుగా యువకుడు.. ఎంక్వైరీ చేయగా దిమ్మతిరిగే ట్విస్ట్