Kitchen Tips: మైక్రోవేవ్ ఓవెన్‌ని ఉపయోగించేవారికి కొన్ని చిట్కాలు..ఓవెన్ లో వేటిని ఉపయోగించకూడదో తెలుసుకోండి
Microwave Safety Tips: మారుతున్న కాలంలో మనిషి లో కూడా అనేక మార్పులు వచ్చాయి. కాలంతో పోటీ పడుతూ మనిషి తన జీవన యానం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది మహిళలైతే..
Microwave Safety Tips: మారుతున్న కాలంలో మనిషి లో కూడా అనేక మార్పులు వచ్చాయి. కాలంతో పోటీ పడుతూ మనిషి తన జీవన యానం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది మహిళలైతే.. ఓ వైపు ఇల్లాలుగా మరోవైపు ఉద్యోగిగా భాద్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో తాను చేసే పనులను సులభంగా చేసుకొనే మార్గాలను ఎంచుకుంటుంది నేటి మహిళ. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్స్, వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్, మిక్సీ. వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ వంటి వాటిని ఉపయోగించాల్సి వస్తుంది. అయితే కొంతమందికి మైక్రోవేవ్ ఎలాంటి ఉపయోగించాలి. ఏ ఆహారపదార్ధాలు, లేదా వేడి చేయడానికి ఏ పాత్రలు ఉపయోగించాలనే అవగాహన లేక కొందరు.. తెలిసినా బద్ధకించి ఇంకొందరు ఎ పాత్రలనైనా వాడేస్తుంటారు. అలా చేయడం చేతులారా ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే. అందుకే, మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించేవారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ‘మైక్రోవేవ్ సేఫ్; పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. ఈరోజు మైక్రో వేవ్ ఓవెన్ లో వేటిని ఉపయోగించకూడదో తెలుసుకుందాం.
!గత కొంత కాలంగా ఆహారపదార్ధాలు వేడి.. స్మూత్ గా ఉండడం కోసం అల్యూమినియం ఫాయిల్ ని ఉపయోగిస్తున్నారు. అయితే మైక్రోవేవ్ ఓవెన్‌లో అల్యూమినియం ఫాయిల్, పాత్రలను అస్సలు పెట్టవద్దు. ఎందుకంటే.. మైక్రోవేవ్ ఓవెన్‌లోని భాగాలు లోహంతో తయారు చేస్తారు. ఓవెన్ లో పెట్టి వేడి చేస్తున్న సమయుంలో రేడియో తరంగాలు రిలీజ్ ఆవుతాయి. అవి లోపల ఉన్న అల్యూమినియం పాత్రలో పడితే జరిగే రసాయనిక చర్య వలన ఓవెన్ పాడయ్యే అవకాశం ఉంది. ఒకొక్కసారి ప్రమాదం కూడా సంభవించవచ్చు.
2 పిల్లలకు పెద్దలకు ఇష్టమైన పాప్ కార్న్ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఈ నేపధ్యంలో కొంతమంది కాగితపు సంచులను ఉపయోగించి మైక్రోవేవ్ ఓవెన్‌లో పాప్‌కార్న్ తయారు చేస్తున్నారు. నిజానికి పేపర్ బాగ్స్ వేడి తట్టుకోలేవు కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక మైక్రోవేవ్‌లోపాప్ కార్న్ తయారీకి పాప్ కార్న్ బ్యాగ్స్ ను ఉపయోగించడం సేఫ్.
౩ మైక్రోవేవ్ ఓవెన్లో నేరుగా కోడి గుడ్లను ఉడికించ వద్దు. ఇలా చేయడం ప్రమాదం. ఒకొక్కసారి గుడ్లు పేలతాయి కూడా కనుక గుడ్లను పగల గొట్టి ఏవైనా ఇతర ఆహార పదార్ధాలతో కలిపి మాత్రమే ఓవెన్ లో పెట్టుకోవాలి. అంతేకాని నేరుగా మాత్రం పెట్టవద్దు
4. సమయం ఎక్కడుంది అంటూ గిన్నెలు తోమే పని తగ్గుతుందని ఎక్కువగా యూజ్ అండ్ త్రో వస్తువులను ఉపయోగిస్తున్నారు. వాటిల్లో ఒకటి థర్మాకోల్‌తో తయారయ్యే స్టైరోఫోమ్ పాత్రలు. వీటిలో తినే ఆహార పదార్ధాలను పెట్టి.. ఓవెన్ లో వేడి చేయడం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..
5. మైక్రోవేవ్ ఓవెన్లలో ఆహారపదార్ధాలను వేడి చేయలన్నా.. ఉడికించాలన్నా ప్లాస్టిక్ సంచులు, కంటైనర్లు కొంతమంది ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా ప్లాస్టిక్ వాటిల్లో పెట్టి ఆహారం వేడి చేసుకుని ఆ ఆహారం తినడం వలన శరీరంలోని హర్మోన్లకు అస్సలు మంచిది కాదు. కనుక ఓవెన్ లో ప్లాస్టిక్ పాత్రలను పెట్టాలంటే.. వాటిపై ప్రత్యేకంగా మైక్రో వేవ్ సేఫ్ అని ఉంటుంది. వాటిని మాత్రమే ఉపయోగించాలి. లేదంటే ప్లాస్టిక్ లో వేడి చేసుకుని తినే ఆహారం ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు.
6 ఇటీవల కొందరు బట్టలు ఈజీగా ఆరిపోతాయంటూ.. మైక్రోవేవ్ ఓవెన్లలో పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఓ వైపు బట్టలు.. మరోవైపు మైక్రోవేవ్ ఓవెన్ పాడవుతుంది.
ముఖ్యంగా మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉపయోగించే పాత్రలకు తప్పనిసరిగా మూతలు ఉండాలి. స్టీల్. రాగి వంటి లోహపు పాత్రలను అస్సలు ఉపయోగించవద్దు. మార్కెట్లో లభించే ‘మైక్రోవేవ్ సేఫ్; అని రాసి ఉండే సిలికాన్, గాజు పాత్రలను మాత్రమే ఓవెన్ కి ఉపయోగించండి.
Also Read: