Andhra Pradesh Capital: పాఠ్య పుస్తకంలో ఏపీ రాజధాని మాయం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..!
Andhra Pradesh Capital: ఇండియా రాజధాని ఏది అంటే టక్కున ఢిల్లీ అని చెబుతారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల రాజధానుల గురించి అడిగినా..
Andhra Pradesh Capital: ఇండియా రాజధాని ఏది అంటే టక్కున ఢిల్లీ అని చెబుతారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల రాజధానుల గురించి అడిగినా.. విద్యార్థులు అంతే స్పీడ్‌లో ఆన్సర్ ఇస్తారు. కానీ, ఏపీ విషయానికి వచ్చే సరికి మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఏపీ రాజధాని ఏది? అంటే మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులే కాదు.. ఆ పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వానిదీ అదే పరిస్థితి అని చెప్పొచ్చు. అందుకేనేమో ప్రభుత్వం కూడా పాఠ్యపుస్తకాల్లో ఏపీ రాజధానికి సంబంధించి వివరాలను ఎగ్గొట్టింది. అవును.. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి గానూ కొత్త పాఠ్యపుస్తకాలను ముద్రించింది. అయితే, నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా మ్యాప్ నుంచి ఏపీ రాజధాని మాయమైంది. ఈ పాఠ్యపుస్తకాల్లో ఇండియా మ్యాప్‌ను, రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను కూడా ముద్రించారు. కానీ, ఏపీ విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. ఏపీ మ్యాప్ వద్దకు వచ్చే సరికి కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాసి సరిపెట్టారు. రాజధాని ఏంటో పేర్కొనలేదు. దీన్ని ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్‌గా మారింది. ఇదీ రాష్ట్ర పరిస్థితి అంటూ నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వానికే క్లారిటీ లేనప్పుడు విద్యార్థులు మాత్రం ఏం చెబుతారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కేవలం రాష్ట్రం పేరు చెప్పి వదిలేయడంపై ఉపాధ్యాయులు, విద్యావంతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ మ్యాప్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏపీ రాజధాని గురించి ఏం చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేసింది. ఆ మేరకు రాజధాని నిర్మాణానికి సంబంధించి శిలాఫలకం ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీచే శంకుస్థాపన చేయించింది. దాంతో ఏపీ రాజధానిగా అమరావతే ఫిక్స్ అయ్యింది. అయితే, టీడీపీ తరువాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటించింది. అయితే, రాజధానికి సంబంధించి ఇప్పటికీ అధికారిక ప్రకటన వెలువడక పోవడంతో ఏపీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మరి రాష్ట్ర ప్రభుత్వంపై దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also read:
IPL 2022 Auction: మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్.. వారెవరంటే?
Mahesh Babu: మేనల్లుడితో మహేష్ బాబు సినిమా ?.. సర్కారు వారి పాటలో హీరో సుధీర్ బాబు తనయుడు..