Mahesh Babu: మేనల్లుడితో మహేష్ బాబు సినిమా ?.. సర్కారు వారి పాటలో హీరో సుధీర్ బాబు తనయుడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాలో
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే సర్కారు వారి పాట నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో మహేష్ బాబుకు మోకాలి సర్జరీ కావడం.. ఆతర్వాత కీర్తి సురేష్, మహేష్ కరోనా బారిన పడడంతో మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యింది. అలాగే ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ కళావతి పాటను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మేనల్లుడు.. హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడట. అంతేకాకుండా.. ఈ మూవీలో చరిత్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట. ఈ సినిమాతో చరిత్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడినే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే గౌతమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సర్కారు వారి పాట వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్ వీడియో..
Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. షాక్ ఇచ్చిన అలియా భట్
Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..
Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..