Tollywood: ఏపీ సినిమా టికెట్ల ధరలపై రానున్న క్లారిటీ.. ఈనెల 17న కమిటీ కీలక భేటీ..

Tollywood: ఏపీ సినిమా టికెట్ల ధరలపై రానున్న క్లారిటీ.. ఈనెల 17న కమిటీ కీలక భేటీ..
Movie Tickets

Tollywood: గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్ని సినిమా సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడేందుకు మార్గం సుగుమం అవుతోంది. తాజాగా గురువారం ఏపీ సీఎమ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖుల సమావేశంతో వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. ఈ క్రమంలోనే...

Narender Vaitla

|

Feb 11, 2022 | 3:35 PM

Tollywood: గతకొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్ని సినిమా సినిమా టికెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడేందుకు మార్గం సుగుమం అవుతోంది. తాజాగా గురువారం ఏపీ సీఎమ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖుల సమావేశంతో వివాదానికి పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. ఈ క్రమంలోనే సినిమా టికట్ల ధరలపై కూడా క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న టికెట్ల ధరల కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే అధికారులు కమిటీ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు.

ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం టాలీవుడ్‌ ప్రముఖులతో జరిగిన చర్చల్లో భాగంగా వచ్చిన అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. టికెట్‌ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్‌ చిత్రాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో సినిమా టికెట్ల విషయంలో గతకొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెర వేసేలా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలంతా ముఖ్యమంత్రితో చర్చించిన విషయం తెలిసిందే.

సినిమా టికెట్‌ ధరల పెంపు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు రాయితీలు లాంటి అంశాలపై ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలో భాగంగా సీఎం టాలీవుడ్‌ ప్రముఖులకు పలు వరాలు కురింపిచన విషయం తెలిసిందే. వైజాగ్‌ను టాలీవుడ్‌కు హబ్‌గా మార్చాలని దానికి టాలీవుడ్‌ ప్రముఖులు సహకరించాలని సీఎం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Also Read: IPL 2022 Auction: ఐపీఎల్ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు షాక్.. తప్పుకున్న ఆ జట్టు బ్యాటింగ్ కోచ్..

మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కిలోమీటర్‌కి 14పైసల ఖర్చు మాత్రమే..?

పొలాల్లో నగ్నంగా పదేళ్ల బాలుడి మృతదేహం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu