- Telugu News Photo Gallery Viral photos Interesting facts about chatak bird who drink only rain water
Viral Photos: వర్షపు నీటితో మాత్రమే దాహం తీర్చుకునే ఏకైక పక్షి ఇదే.. భూమిపై ఉన్న నీరు అస్సలు ముట్టుకోదు..?
Viral Photos: భూమిపై బతికే జీవులన్నింటికి ఆహారం, నీరు రెండూ అవసరం. అవి లేకుండా ఎవరూ జీవించలేరు. కొన్ని జీవులు తక్కువ నీరు తాగి జీవిస్తున్నప్పటికీ ప్రతి
Updated on: Feb 12, 2022 | 6:49 AM

భూమిపై బతికే జీవులన్నింటికి ఆహారం, నీరు రెండూ అవసరం. అవి లేకుండా ఎవరూ జీవించలేరు. కొన్ని జీవులు తక్కువ నీరు తాగి జీవిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరికి నీరు కచ్చితంగా అవసరం. అయితే కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగి బతికే పక్షి ప్రపంచంలో ఉందని మీకు తెలుసా..?

ఆ పక్షి చకోర పక్షి. ఇది ఏ సరస్సు, చెరువు, నది నీరు తాగదు. వర్షం పడితేనే ఈ పక్షి దాహం తీర్చుకుంటుంది. అవసరమైతే దాహంతో చనిపోతుంది కానీ వర్షం నీరు తప్ప మరే ఇతర వనరుల నుంచి నీరు తాగదు.

ఈ పక్షి చాలా ఆత్మగౌరవంగా బతుకుతుంది. ఇది వేరే విధంగా నీటిని తీసుకోదు. చకోర పక్షికి మఘవా, పాపియా అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ పక్షి సొంత గూడును నిర్మించుకోదు. పిల్లలని పెంచదు. ఇది పరాన్నజీవి వర్గంలో బతుకుతుంది.

చకోర పక్షి పై భాగం నలుపు, దిగువ భాగం తెలుపు, తోక ఈకలు తెలుపు, కళ్లు గోధుమ, ముక్కు నలుపు రంగులో ఉంటాయి. భారతీయ పురాణాల ప్రకారం ఈ పక్షి ఆకాశం నుంచి పడే మొదటి వర్షపు బిందువులను తాగుతుంది.

ఈ పక్షి ఆకాశం వైపు మాత్రమే చూస్తుంది. దాహంతో చచ్చిపోతుంది కానీ వేరే మార్గంలో నీరు తీసుకోదు. స్వాతి నక్షత్రంలో కురిసే నీళ్లనే ఈ పక్షి తాగుతుంది.





























