KCR – Komatireddy: జనగామ వేదికగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ అలింగనం.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న నానుడి తెలిసిందే. తాజాగా ఇలాంటి దృశ్యమే జనగామ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో చోటుచేసుకుంది.

KCR - Komatireddy: జనగామ వేదికగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ అలింగనం.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ!
Kcr Komatireddy
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 12, 2022 | 9:26 AM

CM KCR hug with MP Komatireddy Venkatreddy: రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న నానుడి తెలిసిందే. తాజాగా ఇలాంటి దృశ్యమే జనగామ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్‌ తెలంగాణ(Telangana) జిల్లాల ప‌ర్యట‌న పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం జ‌న‌గామ జిల్లా నూత‌న క‌లెక్టరేట్‌(Collectorate) అధునాత‌న కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆస‌క్తిక‌ర రీతిలో ప్రశంస‌ల వర్షం కురిపించారు. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసి, స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం ప‌ట్ల సీఎం కేసీఆర్‌కు హృద‌య‌పూర్వక కృత‌జ్ఞత‌లు తెలిపారు ఎంపీ కోమ‌టిరెడ్డి. ఈ ప్రశంస‌ల‌కు కార‌ణం ఎప్పట్లాగే కేసీఆర్ వ్యూహాలు, కార్యాచ‌ర‌ణ‌!

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భువ‌న‌గిరి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి జ‌న‌గామ జిల్లా వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, కోమటిరెడ్డి అత్మీయంగా ఒకరినొకరు పలకరించుకంటూ సరదా గడిపారు. అంతేకాదు ఇద్దరు అలింగనం చేసుకుని కలిసిపోయారు. ఈ ఘటనను చూసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు కొంత అశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడు అధికారపక్ష, విపక్షాలు.. ఒకరిపై దుమ్మెత్తిపోసుకోవడం సహజం. ఇటీవల కాలంగా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి జనగామ కలెక్టరేట్ సాక్షిగా ఒక్కటై పోయినట్లు కనిపించింది. ఇదిలావుంటే, పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్ దగ్గర కావడంతో తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది.

అంతేకాదు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమ‌టిరెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎక్కడా లేని విధంగా నూత‌న క‌లెక్టరేట్‌లు నిర్మిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియ‌ట్‌లు కూడా ఈ విధంగా నిర్మించ‌లేదు. జ‌న‌గామ క‌లెక్టరేట్ భ‌వ‌నం అత్యంత అద్భుతంగా అధునాతనంగా నిర్మించారంటూ ఎంపీ కోమటి రెడ్డి కొనియాడారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు జ‌న‌గామ జిల్లా ప్రజ‌ల త‌ర‌పున ధ‌న్యవాదాలు తెలుపారు. క‌రోనా కార‌ణంగా రాష్ట్రానికి స‌రైన ఆదాయం లేక‌పోయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. తెలంగాణ వ‌చ్చింది కాబ‌ట్టి మ‌నం మ‌నం కొట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదని సైతం కోమ‌టిరెడ్డి సూచించారు. బ‌స్టాండ్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటు చేసి, స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వ‌నాల‌ను నిర్మించ‌డం ప‌ట్ల సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు కోమ‌టిరెడ్డి.

Read Also….  Viral Video: కొద్ది క్షణాల్లో పెళ్లి.. ఇంతలో ఆఫీస్‌నుంచి ఫోన్‌.. పెళ్లి పీటలపై ల్యాప్‌టాప్‌‌తో.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో..