Telangana Accident: అతివేగం.. ఓవర్ టేక్.. గాల్లో కలిసిన రెండు ప్రాణాలు
కూతురి కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపిన ఆ దంపతులను రోడ్డు ప్రమాదం(Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. పూజా కార్యక్రమాలకు హాజరై సంతోషంతో తిరుగు ప్రయాణమైన...
కూతురి కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపిన ఆ దంపతులను రోడ్డు ప్రమాదం(Road Accident) రూపంలో మృత్యువు కబళించింది. పూజా కార్యక్రమాలకు హాజరై సంతోషంతో తిరుగు ప్రయాణమైన వారిని అతివేగంగా దూసుకొచ్చిన వాహనం ప్రాణాలు తీసింది. రామకృష్ణాపూర్(Ramakrishnapur) పట్టణంలోని స్థానిక ఆర్కేపీ ఓసీ కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని(Godavarikhani) కి చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు ఉప్పరవేన స్వామి దంపతులు మృతి చెందారు. స్వామి, లక్ష్మి దంపతులు.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నివాసముండే వారి పెద్ద కుమార్తె ఇంటి వద్ద సమ్మక్క పూజలు చేయడంతో వారి ఇంటికి వెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగించుకుని ద్విచక్రవాహనంపై గోదావరిఖనికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆర్కేపీ సింగరేణి ఏరియా ఆసుపత్రి సమీపానికి చేరుకోగానే.. శ్రీరాంపూర్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఓ ఇన్నోవా వాహనం మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే సమయంలో వీరి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.
ఈ ఘటనలో స్వామి ఇన్నోవా వాహనం ముందుర భాగాన్ని ఢీ న్నాడు. అతడు అక్కడిక్కడే మృతి చెందగా లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని సమీపంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యలో లక్ష్మి మృతి చెందింది. మృతిచెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
Bananas: అరటిపండ్లు తొందరగా పక్వానికి రావొద్దంటే ఏం చేయాలి.. వీటిని పాటిస్తే చాలు..?
Coffee Side Effects: కాఫీ ప్రియులకు అలర్ట్.. ఉదయం లేవగానే తాగితే అంతే సంగతులు.. ఎందుకంటే..?