Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: చిన్నారిని చిదిమేసిన చక్రాలు.. కన్న తల్లి కళ్లెదుటే ఘోరం

అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఆ చిన్నారిలో క్షణమైనా నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ చిన్నారిని మృత్యువు కబళించింది. తల్లి, అమ్మమ్మతో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది...

Road Accident: చిన్నారిని చిదిమేసిన చక్రాలు.. కన్న తల్లి కళ్లెదుటే ఘోరం
Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 12, 2022 | 8:23 AM

అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఆ చిన్నారిలో క్షణమైనా నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ చిన్నారిని మృత్యువు కబళించింది. తల్లి, అమ్మమ్మతో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారి తలపై నుంచి వ్యాన్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని ప్రమాదంలో తమ కలల ప్రతిరూపం కళ్లెదుటే చనిపోవడంతో తల్లీ, అమ్మమ్మలు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో తోట సుమన్.. విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో భాగంగా అంతర్వేదికి మూడు రోజుల పాటు వెళ్లారు. దీంతో కుమార్తె, మనుమరాలిని ఇంటికి తీసుకెళ్లేందుకు సుమన్‌ అత్త దుర్గా భవాని ప్రత్తిపాడు వచ్చి ఇద్దర్నీ ద్విచక్ర వాహనంపై వేమగిరి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాజానగరం వద్ద వెనుక నుంచి ఓ వ్యాను అతివేగంగా వచ్చి.. వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అంతే కాకుండా ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో బాలిక తల పై నుంచి వ్యాన్‌ చక్రాలు వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి, అమ్మమ్మ మరో వైపునకు పడిపోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.

చిన్నారి ఆద్య మృతితో తల్లి స్వరూప, అమ్మమ్మ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read

Bananas: అరటిపండ్లు తొందరగా పక్వానికి రావొద్దంటే ఏం చేయాలి.. వీటిని పాటిస్తే చాలు..?

UGC: కాలేజీ, యూనివర్సీటీలకు UGC కీలక ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..

Indian Embassy: ఇరాన్‌లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి.. భారత మారిటైమ్ యూనియన్ చొరవతో విడుదల