CM KCR Yadadri Tour: జిల్లాల్లో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు.. నిన్న జనగామ, ఇవాళ యాదాద్రి..
జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ భువనగరి యాదాద్రి జిల్లాకు రానున్నారు. భువనగిరిలో నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.
CM KCR Yadadri District Tour: జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఇవాళ భువనగరి యాదాద్రి జిల్లాకు రానున్నారు. శుక్రవారం జనగాం(Jangoan)లో పర్యటించిన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్(Collectorate), టీఆర్ఎస్(TRS) జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12వ తేదీ శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 12:30 గంటలకు యాదాద్రిలో నిర్మించిన ప్రెసిడెన్షియల్స్ సూట్స్, వీవీఐపీ కాటేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం శరవేగంగా జరగుతున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు.
అలాగే, మధ్యాహ్నం 1 గంటకు సుదర్శన మహా యాగం కోసం ఏర్పాటు చేసి యాగశాల పరిశీలించనున్నారు. అక్కడి నుంచి భువనగిరికి బయలుదేరుతారు. భువనగిరిలో నూతనంగా నిర్మించిన అధునాతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాయగిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం కేసీఆర్.. తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ సక్సెస్ కోసం ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు.. నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి.. జిల్లా టీఆర్ఎస్ నేతలతో పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. నిన్న జనగామ జిల్లా పర్యనటలో వరాలు కురిపించారు. ఈ సభలో కేంద్రంపై విరుచుకుపడిన కేసీఆర్.. నేడు రాయగిరిలో జరిగే బహిరంగ సభలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందని తెలుస్తోంది.