ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు..?

Central Bank UCO Bank: ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. రెపో రేటు 4 శాతం,

ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు..?
Fd
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2022 | 12:45 PM

Central Bank UCO Bank: ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం మారదు. మానిటరీ పాలసీ కమిటీ ప్రకటన తర్వాత రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటును అప్‌డేట్ చేశాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, UCO బ్యాంక్ ఫిబ్రవరి 10 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. అయితే ఇది 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకి మాత్రమే వర్తిస్తుంది. మారిన వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీస వడ్డీ రేటు 2.75 శాతం, గరిష్ట వడ్డీ రేటు 5.15 శాతం. 7 నుంచి 14 రోజులకు 2.75 శాతం, 15-30 రోజులకు 2.90 శాతం, 31-45 రోజులకు 2.90 శాతం, 46-90 రోజులకు 3.25 శాతం, 91-179 రోజులకు 3.80 శాతం ఉంటుంది. అలాగే 180-364 రోజులకు 4.25 శాతం, 2 సంవత్సరాల నుంచి1 సంవత్సరం లోపు వారికి 5 శాతం, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు వారికి 5.10 శాతం, 3-5 సంవత్సరాల లోపు వారికి 5.10 శాతం, 5-10 సంవత్సరాలకు 5.15 శాతం ఉంటుంది.

UCO బ్యాంక్ కనీస వడ్డీ రేటు 2.80 శాతం, గరిష్ట వడ్డీ రేటు 5.60 శాతం. 7నుంచి 29 రోజులకు 2.80 శాతం, 30-45 రోజులకు 3.05 శాతం, 46-90 రోజులకు 3.80 శాతం, 91-180 రోజులకు 3.95 శాతం, 181-364 రోజులకు 4.65 శాతం.1 సంవత్సరానికి 5.35 శాతం, 1-2 సంవత్సరాలకు 5.60 శాతం, 2-3 సంవత్సరాలకు 5.60 శాతం, 3-5 సంవత్సరాల కంటే తక్కువ వారికి 5.80 శాతం, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వారికి 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు కొత్త రేటు 4.05 శాతం నుంచి 6.55 శాతం వరకు ఉంటుంది.

SBI, HCFC, ICICI బ్యాంక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కనీస వడ్డీ 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు అందిస్తుంది. ఇది 7 రోజుల నుంచి10 సంవత్సరాల వరకు ఉంటుంది. జనవరిలో ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. ఈ వడ్డీ రేటు 2.50 శాతం నుంచి 5.60 శాతం వరకు ఉంటుంది. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వడ్డీ రేటును 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు FDలపై వడ్డీ రేటు 5.2 శాతం, 3 సంవత్సరాలకు 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు 5.4 శాతం, 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు 5.6 శాతం వడ్డీగా నిర్ణయించారు.

100 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Twitter: అంతరాయంపై స్పందించిన ట్విట్టర్.. అసౌకర్యానికి క్షమించాలని వేడుకోలు..

Kiss Day 2022: గిన్నిస్ రికార్డ్‌ సాధించిన ‘ముద్దు’ ముచ్చట ఇదే.. ఎన్ని గంటలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?