Hug Day 2022: కౌగిలింత వల్ల లవ్ హార్మోన్ పెరుగుతుంది.. శరీరంలో ఈ మార్పులు..?
Hug Day 2022: కౌగిలింత రిలాక్స్‌గా ఉంటుంది. అలసట, బాధ, కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. వాలెంటైన్స్ వీక్‌లో ఫిబ్రవరి 12న హగ్ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఇష్టమైనవారిని
Hug Day 2022: కౌగిలింత రిలాక్స్‌గా ఉంటుంది. అలసట, బాధ, కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. వాలెంటైన్స్ వీక్‌లో ఫిబ్రవరి 12న హగ్ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఇష్టమైనవారిని కౌగిలించుకుంటారు. వారితో సన్నిహితంగా ఉంటారు. సుఖ దుఃఖాల సందర్భంగా సన్నిహితులను కౌగిలించుకుని తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఇష్టమైనవారిని ఓదార్చడం, మనసులో మాట చెప్పడం, ప్రేమను తెలియజేయడం, ఒత్తిడిని తగ్గించడంలాంటివి కౌగిలించుకున్నప్పుడే తెలుస్తుంది. కౌగిలించుకోవడం వల్ల హృదయం, మనస్సుకి చాలా ప్రయోజనాలను ఉన్నాయి. మనిషి బతకాలంటే రోజూ కనీసం 4 సార్లు కౌగిలించుకోవాలి. అంతే కాదు జీవితంలో ఎటువంటి సమస్య ఉండకూడదనుకుంటే ప్రతిరోజూ 8 సార్లు కౌగిలించుకోవాలి. మీ అభివృద్ధి మరింత మెరుగ్గా జరగాలంటే ప్రతిరోజూ కనీసం 12 సార్లు కౌగిలించుకోవడం అవసరం. కౌగిలింత ప్రయోజనాలను తెలుసుకోండి.
1. కౌగిలి వల్ల ఆందోళనకి చెక్
కౌగిలించుకోవడం అనేది అనుభూతి మాత్రమే కాదు. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కౌగిలించుకోవడం వల్ల రక్తంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. దీని వల్ల వ్యక్తికి పెరిగిన రక్తపోటు తగ్గుతుంది. ఒత్తిడి, భయం వంటి సమస్యలు ఉండవు. కౌగిలించుకోవడం వల్ల మెదడులోని నరాలు బలపడటంతో జ్ఞాపకశక్తి బలంగా ఉంటుంది.
2. కౌగిలించుకోవడం వల్ల టెన్షన్ తగ్గుతుంది
ఒకరిని కౌగిలించుకోవడం వల్ల వారి ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. అంతే కాదు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ప్రేమతో కౌగిలించుకోవడం ఎదుటి వ్యక్తికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీని కారణంగా వారి శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిడి నుంచి వ్యక్తిని రక్షించడంలో సహాయపడుతుంది.
3. హృదయానికి మంచిది
కౌగిలించుకోవడం వల్ల శరీరంలో లవ్ హార్మోన్ అంటే ఆక్సిటోసిన్ స్థాయి పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఎవరినైనా కౌగిలించుకుంటే వారి శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
4. శరీరానికి విశ్రాంతి
ఒకరిని కౌగిలించుకున్నప్పుడు మన కండరాలు శరీరమంతా ఉద్రిక్తంగా ఉంటాయి. ఇది శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది. వ్యక్తి రిలాక్స్ అవుతాడు. కానీ ఆధునిక జీవితంలో కౌగిలింతలు తక్కువై పోయాయి.