Nawab Family For 2600 Crores: పూర్వీకుల ఆస్తి కోసం 50 ఏళ్ల న్యాయపోరాటం.. రూ. 2600 కోట్ల ఆస్తి దక్కించికున్న వారసులు.. ఎలాగంటే..
Nawab Family For 2600 Crores: వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తి కోసం వారు ఒకటి రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్ల పాటు కోర్టులో పోరాడారు. తమకు హక్కుగా రావలసిన సొమ్మును దక్కించుకోవడానికి ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపుర్ కు చెందిన నవాబు రజ అలీఖాన్ కుటుంబం...
Nawab Family For 2600 Crores: వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తి కోసం వారు ఒకటి రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్ల పాటు కోర్టులో పోరాడారు. తమకు హక్కుగా రావలసిన సొమ్మును దక్కించుకోవడానికి ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపుర్ కు చెందిన నవాబు రజ అలీఖాన్ కుటుంబం న్యాయపోరాటాన్ని సాగించి చివరికి గెలిచింది. ఇలా అలుపెరగని పోరాటం చేసి సుమారు రూ. 2,600 కోట్లు విలువైన ఆస్తిని వారు దక్కించుకున్నారు. ఇలా అలనాటి నవాబుకు చెందిన విలాసవంతమైన బంగ్లాలు, ప్యాలెస్, ఖరీదైన వస్తువులు, మహల్‌లో ఉంచిన అలనాటి కార్లు, విలువైన పరికరాలు.. ఇలా వేల సంఖ్యలో ఉన్న వస్తువులను వారసులు పంచుకోవాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఇంతకాలం రాంపూర్ చివరి నవాబుకు చెందిన ఆస్తిని తమ ఆధీనంలో పెట్టుకున్న కోర్టు ఎట్టకేలకు.. ఆ వంశానికి చెందిన 14 మంది వారసులకు సమానంగా పంచుకోవాలని తీర్పు వెలువరించింది. వేల కోట్ల ఆస్తి పంపకం కేసుగా ఇది రికార్డు సృష్టిస్తే.. దేశంలోనే అత్యధికంగా 50 ఏళ్ల పాటు కోర్టులో సాగిన కేసుగా రికార్డులో నిలిచింది.
ఆ కాలంలో రాజులు, నవాబులకు విలాసవంతమైన జీవితాలు, ఎన్నో విలువైన ఆస్తులు, ఆభరణాలు, వజ్రాలు, భవంతులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉండేవి. కానీ.. ప్రస్తుత రాంపూర్ నవాబు ఆస్తుల విషయంలో ఓ విచిత్రమైన అంశం ఏంటంటే అప్పట్లో వారి ప్రయాణానికి ప్రత్యేక రైల్వేస్టేషన్, రైలు ఉండేవంటే వాళ్ల రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ నవాబుకు ఇలాంటి ఆస్తి లేకపోవడం విశేషం. ఈ రైలు ప్రయాణం కోసం నిర్మించిన 40 కిమీ ట్రాక్‌తో నాలుగు కంపార్ట్‌మెంట్‌లు కలిగిన ట్రైన్ వారికి ఉండేది. అందులోనూ ఒకటి ఏసీ కంపార్ట్ మెంట్ ఉండటమంటే మాటలు రావడం లేదు. దిల్లీ, లఖ్ నవూ లకు వెళ్లేందుకు అప్పట్లో దీనిని వారు వినియోగించేవారని తెలుస్తోంది. ఇన్నాళ్లుగా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచిన గతకాలం నాటి చెందిన ఆయుధాలను కోర్టు బయటకు తీయించింది. వారసులు న్యాయబద్ధంగా, ముస్లిం పెద్దల సమక్షంలో ఆస్తులను పంచుకోవాలని సుప్రీం కోర్టు 2019 జులై 30న ఆర్డర్ జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు జిల్లా న్యాయస్థానం.. ఈ ఆస్తిపంపకాల కేసును తమ ఆధీనంలోకి తీసుకొని 14 మంది వారసులకు సమానంగా ఆస్తులను పంచేందుకు వాటి మార్కెట్ విలువలను లెక్కించే పని కొనసాగుతోందని లాయర్ సందీప్ సక్సెనా పేర్కొన్నారు. కానీ.. నవాబు వారసులు మాత్రం ప్రభుత్వం వెల్లడించిన విలువకంటే.. ఆస్తుల విలువ ప్రస్తుతం ఎక్కువేనని అంటున్నారు. ఏదేమైనా 50 ఏళ్లు న్యాయపోరాటం తరువాత పూర్వీకుల ఆస్తిని నవాబు వారసులు దక్కించుకున్నారు.
ఇవీ చదవండి..
Train Ticket: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. క్యూ ఆర్ కోడ్ తో రైల్వే టికెట్లు..