Rakesh Jhunjhunwala: ఒక్కరోజే రూ. 426 కోట్లు కోల్పోయిన బిగ్ బుల్.. ఏ కంపెనీల్లో అంటే..
Rakesh Jhunjhunwala: వరుసగా గత కొంతకాలంగా ఒడిదొకుల మధ్య స్టాక్ మార్కెట్లు ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధానంగా పెరుగుతున్న ద్రవ్యోల్బనం, అంతర్జాతీయ పరిస్థితులు కారణంగా..
Rakesh Jhunjhunwala: వరుసగా గత కొంతకాలంగా ఒడిదొకుల మధ్య స్టాక్ మార్కెట్లు(stock market) ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధానంగా పెరుగుతున్న ద్రవ్యోల్బనం(Inflation), అంతర్జాతీయ పరిస్థితులు కారణంగా నిలుస్తున్నాయి. ఈ కారణాల వల్ల సుమారు లక్ష కోట్ల మేర మదుపరుల సంపద ఒక్కరోజే ఆవిరైంది. స్టాక్ మార్కెట్లో దిగ్గజాలుగా ఉండేవారు ఎప్పుడూ నష్టపోరు అనేది అవాస్తవం. అది కేవలం ఒక అపనమ్మకం మాత్రమే. తాజాగా శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝన్ వాలా ఒక్కరోజే రూ. 426 కోట్ల సంపదను కోల్పోయారు. సంపాదించడంలోనే కాదు.. దానిని కోల్పోవడం వల్ల కూడా వారి పేరు వైరల్ గా మారుతుంది.
బిగ్ బుల్ కు ఎంతగానో ఇష్టమైన టైటాన్ షేరు ధర రూ. 53.20, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ షేరు ధర రూ. 18.55 మేర తగ్గడంతో ఝున్ ఝున్ వాలా దంపతుల పెట్టుబడి రూ. 425 కోట్ల మేర ఆవిరైంది. టైటాన్ కంపెనీలో రాకేశ్ కు 4.20 శాతం వాటా(3,57,10,395 షేర్లు).. ఆయన భార్య రేఖా కు 1.07 శాతం(95,40,575 షేర్లు) ఉన్నాయి. దంపతులిద్దరూ కలిపి కంపెనీలో మెుత్తం 5.09 శాతం వాటాను కలిగిఉన్నారు. ఈ కొత్త కంపెనీలోనే వారిద్దరికీ కలిపి రూ. 240 కోట్లు సంపద ఆవిరైంది. ఇలాగే వారు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మెుత్తం 17.50 శాతం(10,07,53,935 షేర్లు)వాటా కలిగి ఉన్నారు. ఈ పెట్టుబడి విలువలో వారు రూ. 186 కోట్ల మేర సంపదను కోల్పోయారు.
ఇవీ చదవండి..
Blue hydrogen: ఆ వ్యాపారం కోసం 75 బిలియన్ డాలర్లు వెచ్చిస్తానన్న అంబానీ.. ఉత్పత్తి కోసం..
Mukesh Ambani: ముకేశ్ అంబానీకి నచ్చిన పాట.. ఆయన నోటే వినండి.. దానికి అర్థమేంటో తెలుసుకోండి..
Black hawk Chopper: గాల్లో చక్కర్లు కొట్టిన పైలెట్ రహిత ఛాపర్ .. వైరల్ వీడియో మీకోసం..