India Corona: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 50,407 మందికి పాజిటివ్, 804మంది మృతి

భారతదేశంలో కరోనా కల్లోలం మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఒక్క రోజులో 50,407 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 13 శాతం త‌గ్గిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

India Corona: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. కొత్తగా 50,407 మందికి పాజిటివ్, 804మంది మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 12, 2022 | 10:24 AM

India Coronavirus Cases: భారతదేశంలో కరోనా కల్లోలం మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఒక్క రోజులో 50,407 కొత్త కరోనావైరస్(Covid 19) కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 13 శాతం త‌గ్గిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశ‌వ్యాప్తంగా నిన్న రిక‌వ‌రీ కేసుల సంఖ్య 1,36,962గా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తాజా గణాంకాలను విడుదల చేస్తూ, రోజువారీ మరణాలు 804 నమోదయ్యాయని తెలిపింది . దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,07,981కి చేరింది. ప్రస్తుతం, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,443, ఇది మొత్తం కేసులలో 1.43 శాతం. అయితే, డెయిలీ పాజిటివిటీ(Positivity) రేటు 3.48 శాతంగా ఉంది. దీంతో ఇప్పటి వ‌ర‌కు దేశంలో 1,72,29,47,688 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు నియంత్రణకు విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. మార్కెట్లు, దుకాణాలు మరియు ఇతర వ్యాపారాలు సాధారణంగా పనిచేయాలని సిక్కిం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, రాజకీయ, మత, క్రీడలకు సంబంధించిన సమావేశాలపై ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ మినహా అన్ని కోవిడ్ ఆంక్షలను తొలగించాలని నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యాయి. అన్ని సామాజిక, వాణిజ్య, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేశారు.

కేరళలో అత్యధిక మరణాలు

ఇదిలావుంటే, దేశంలోనే కరోనా మరణాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్క రోజులో 241 మరణాలు నమోదయ్యాయి. అయితే 251 బ్యాక్‌లాగ్ మరణాల కొత్త సంఖ్య కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కేరళలో ఒక్కరోజులోనే మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. కేరళ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 63 మంది మరణించారు. దీని తర్వాత, కర్ణాటకలో 41 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 12, ​గుజరాత్‌లో 14, ఒడిశాలో 20, తమిళనాడులో 25, ఉత్తరప్రదేశ్‌లో 27 మరణాలు నమోదయ్యాయి.

కేరళ ఆంక్షలు సడలింపు

అయితే, కేరళలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదవుతోంది. అయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. కేరళ శుక్రవారం కోవిడ్ పరిమితులను మరింత సడలించింది. అలువా శివరాత్రి, మారమన్ కన్వెన్షన్, అట్టుకల్ పొంగలతో సహా రాష్ట్రంలోని ప్రధాన మతపరమైన పండుగలు, కార్యక్రమాలకు 1,500 మందిని అనుమతించాలని నిర్ణయించింది.

Read Also…. Supreme on Hijab: దేశంలో హిజాబ్ ప్రకంపనలు.. అత్యవసర పిటిషన్‌కు సుప్రీం నో.. వివాదంపై చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు