Supreme on Hijab: దేశంలో హిజాబ్ ప్రకంపనలు.. అత్యవసర పిటిషన్‌కు సుప్రీం నో.. వివాదంపై చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు నో చెప్పింది సుప్రీంకోర్టు. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

Supreme on Hijab: దేశంలో హిజాబ్ ప్రకంపనలు.. అత్యవసర పిటిషన్‌కు సుప్రీం నో.. వివాదంపై చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Supreme Court
Follow us

|

Updated on: Feb 12, 2022 | 10:00 AM

Hijab row reaches Supreme Court: కర్ణాటక(Karnataka)ను కుదిపేస్తున్న హిజాబ్ వ్యవహారంపై అత్యవసర విచారణకు నో చెప్పింది సుప్రీంకోర్టు. హిజాబ్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ(CJI NV Ramana). ఈ మేరకు పిటిషన్​ను తోసిపుచ్చుతూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. పిటిషన్​పై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వడండన్నారు. హైకోర్టు(High Court) ఆదేశాలు రాక ముందే ఏం చేయగలమంటూ ప్రశ్నించారు. ఏమి జరుగుతుందో మాకు తెలుసు.. దయచేసి ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు, జాతీయ స్థాయి తీసుకెళ్లోద్దని సూచించారు చీఫ్ జస్టిస్. ఇప్పుడు ఈ అంశం ఢిల్లీకి తీసుకురావడం సరైందేనా..? ఒక్కసారి ఆలోచించలన్నారు. కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకునేది లేదంటూ స్పష్టం చేశారు. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే ఢిల్లీలో మేమున్నామని.. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటామని చెప్పారు జెస్టిస్ ఎన్వీ రమణ.

కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన హిజాబ్‌ అంశం రాష్ట్ర హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని కర్ణాటక హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ ఫాతిమా బుష్రా అనే విద్యార్థి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హిజాబ్ ధరించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కని, హైకోర్టు ఆదేశం ఆ హక్కును కాలరాస్తుందని వాదించింది. ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండడంతో కాలేజీల్లో ఇబ్బందికర ఘటనలు జరగకుండా చూడాలంటూ ఆమె తన పిటిషన్‌లో కోరింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.

Read Also…  CM KCR Yadadri Tour: జిల్లాల్లో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు.. నిన్న జనగామ, ఇవాళ యాదాద్రి..

Latest Articles