Corona Test: ఇంట్లో కరోనా టెస్ట్‌ చేస్తున్నారా?.. అయితే, ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..

Corona Test: ఇంట్లో కరోనా టెస్ట్‌ చేస్తున్నారా?.. అయితే, ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..

Corona Test: గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి యావత ప్రపంచ జనాభాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మాయదారి కరోనా.. ఎక్కడి వస్తుందో,

Shiva Prajapati

|

Feb 11, 2022 | 8:41 PM

Corona Test: గడిచిన రెండేళ్లుగా కరోనా మహమ్మారి యావత ప్రపంచ జనాభాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మాయదారి కరోనా.. ఎక్కడి వస్తుందో, ఎలా వ్యాపిస్తుందో తెలియక బిక్కు బిక్కుమంటూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రూపంలో విజృంభించిన కరోనా.. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని గడగడలాడించింది. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జనాలు హడలిపోయారు. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసుల భారీగా పెరగడం, ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, సెకండ్ వేవ్‌కి, థర్డ్ వేవ్‌కి పరిస్థితులు మారిపోయాయి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని వైద్య సదుపాయాలను అందులోకి తీసుకువచ్చాయి ప్రభుత్వాలు. ఆ క్రమంలోనే కరోనా టెస్టుల కోసం ఆస్పత్రులకు పరుగులు పెట్టకుండా ఉండేందుకు.. ఇంట్లోనే టెస్టులు చేసుకునేందుకు వీలుగా ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు వచ్చాయి. తొలుత కొంత తక్కువ ఉత్పత్తి అయినా.. ఇప్పుడు మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి.

తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య చాలా మంది ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌లతో ఇంట్లోనే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. అయితే, సెల్ఫ్ కరోనా టెస్టులు చేసుకునేందు ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మనకు కరోనా సోకిన కనీసం రెండు రోజుల తర్వాత గానీ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు వైరస్‌ను గుర్తించవు. కనీసం మూడు రోజుల తర్వాత చేస్తే ఫలితం కరెక్ట్‌గా వస్తుంది. మరి వైద్యులు చేసిన ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 1.  కరోనా టెస్టింగ్ కిట్‌లను ఫ్రిజ్‌లో భద్రపర్చకూడదు.
 2. టెస్టు కిట్‌లను ఎప్పటిలోగా ఉపయోగించాలన్న గడువు తేదీని చెక్‌ చేసుకోవాలి.
 3. పరీక్షకు మీరు సిద్ధమైన తర్వాతే కిట్‌లోని వస్తువులను తెరవాలి.
 4. టెస్టుకు ముందే కవర్‌పై ఉన్న సూచనలను చదువుకోవాలి.
 5. నాజల్‌ స్వాబ్‌ చేసుకునేముందు ముక్కును చీది శుభ్రంగా ఉంచుకోవాలి.
 6. స్వాబ్‌ను నెమ్మదిగా 2-3 సెంటీమీటర్ల వరకు నాసికా రంధ్రంలోకి తీసుకెళ్లి అప్పుడు టెస్టుకు అవసరమైనన్ని సార్లు గుండ్రంగా తిప్పాలి.
 7. లాలాజలంతో చేసే యాంటిజెన్‌ టెస్టుకు 30 నిమిషాల ముందు తినడం, తాగడం, బబుల్‌ గమ్‌ నమలడం, పొగ తాగడం, పళ్లు తోముకోవడం వంటివి చేయకూడదు.
 8. కిట్‌పై C, T అనే అక్షరాలతో రెండు లైన్లు ఉంటాయి.
 9. ఆ రెండు లైన్లపై చారలు కన్పిస్తే కొవిడ్ పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారించుకోవాలి.
 10. ఒకవేళ C లైన్‌ వద్ద మాత్రమే చార కన్పిస్తే కొవిడ్‌ నెగెటివ్‌గా పరిగణించాలి.
 11. అలా కాకుండా T లైన్‌ వద్ద మాత్రమే చార కన్పించినా.. లేదా ఎలాంటి చారలు కన్పించకపోయినా మీరు సరిగా టెస్టు చేయలేదని అర్థం. మళ్లీ కొత్తగా టెస్టు చేసుకోవాల్సి ఉంటుంది.

Also read:

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

IPL 2022 Auction: కేకేఆర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. వేలంలో ఈ 5గురు సొంతమయ్యేనా?

Post Office Scheme: ఈ పోస్టాఫీస్ పథకంలో అత్యుత్తమ వడ్డీ రేటు.. నెలకు రూ.12,500తో కోటి రూపాయలు మీ సొంతం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu