Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: అధిక బరువున్నవారికి పరిశోధకుల హెచ్చరిక! షాకింగ్‌ విషయాలు వెల్లడి..

ఒబేసిటీ (obesity)కి ఎముకల ఆరోగ్యానికి చాలా దగ్గరి తత్సంబంధం ఉన్నట్టు పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ సమస్య మహిళల్లో కన్నా పురుషుల్లోనే..

Knowledge: అధిక బరువున్నవారికి పరిశోధకుల హెచ్చరిక! షాకింగ్‌ విషయాలు వెల్లడి..
Obesity
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2022 | 8:46 PM

Obesity in Men: ఈ రోజుల్లో అధిక బరువు కూడా సర్వసాధారణమైపోయింది. అధిక బరువున్నవారిలో సాధారణంగానే ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఐతే ఒబేసిటీ (obesity)కి ఎముకల ఆరోగ్యానికి చాలా దగ్గరి తత్సంబంధం ఉన్నట్టు పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ సమస్య మహిళల్లో కన్నా పురుషుల్లోనే అధికమని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికన్ విశ్వవిధ్యాలయం ఈ కొత్త విషయాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనం ఏం చెబుతోందంటే.. శరీరంలో కొవ్వు స్థాయిలు అధికంగా ఉండే పురుషులతోపోల్చితే, సాధారణ బరువు ఉండే వ్యక్తుల్లోకన్నా ఎముకల సాంద్రత (one density) చాలా తక్కువగా ఉందని తెలిసింది. అంటే ఎముకల ఆరోగ్యం ఊబకాయంతో ముడిపడి ఉంటుందన్నమాట. 60 ఏళ్ల లోపు ఉన్న సుమారు 11 వేల మందిపై చేసిన అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ఆఫ్ ది ఎండోక్రైన్ సొసైటీలో ప్రచురితమైన రీసెర్చ్‌ పేపర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ పరిశోధనా పత్రం (రీసెర్చ్‌ పేపర్‌) ప్రకారం.. 60 ఏళ్లలోపున్న 10,814 మందిలో బోన్‌ మినరల్‌ డెన్‌సిటీనీ విశ్లేసించిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు. దీని కోసం యూఎస్‌ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ టెస్టింగ్ సర్వే (NHANES) నుండి డేటాను స్వీకరించారు. ఇవి 2011 నుండి 2018 వరకు సేకరించిన గణాంకాలు.’అధిక కొవ్వులతో కూడిన ఆహారాన్ని తీసుకునే వారిలో ఎముకలు బలహీణంగా (పెలుసుగా) ఉండటాన్ని మేము కనుగొన్నాము. అంతేకాదు ఈ మార్పు స్త్రీల కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది’ అని ఇల్లినాయిస్‌లోని చికాగో మెడిసిన్ విశ్వవిద్యాలయం ఎమ్డీ రాజేష్ జైన్ తెలిపారు.

తక్కువ కొవ్వులున్న ఆహారం ఎముక ఖనిజ సాంద్రతతో సానుకూల సంబంధం కలిగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది పురుషులు, మహిళలు ఇరువురికీ వర్తిస్తుంది. అధిక కొవ్వు తీసుకోవడం ఎముక ఖనిజ సాంద్రతపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల విషయంలో అధిక కొవ్వులు ఎముకల ఆరోగ్యానికి హాని తలపెడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. అదేవిధంగా అధిక బరువు ఉన్న రోగులు ఎముకలు గుల్లబారే వ్యాధి (osteoporosis screening) బారిన పడుతున్నట్టు హెల్త్‌కేర్ ప్రొవైడర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యం, ఎముక పగుళ్లతో బాధపడే రోగులు, వంశపారంపర్యం లేదా స్టెరాయిడ్ వాడకం వంటి ఇతర కారకాలు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువని’ జైన్ తెలిపారు.

Also Read:

Big News Big Debate Live Video: 2024కు కేసీఆర్‌ టార్గెట్‌ ఫిక్స్‌ అయిందా? దేనికైనా రెడీ అని ఎందుకంటున్నారు?