AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Health: కళ్ల కింద క్యారీ బ్యాగులతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ టిప్స్‌ పాటించండి.. వెంటనే రిజల్ట్స్‌..

Eye Health: అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటాం. అయితే మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పులు వస్తుండంతో ఆ ప్రభావం మనిషి ఆహార్యంపై కూడా పడుతోంది. ముఖ్యంగా షిఫ్టుల్లో పనిచేస్తుండడం, స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరగడం, రాత్రుళ్లు నిద్ర లేకపోవడం కారణంగా..

Eye Health: కళ్ల కింద క్యారీ బ్యాగులతో ఇబ్బంది పడుతున్నారా.? ఈ టిప్స్‌ పాటించండి.. వెంటనే రిజల్ట్స్‌..
Eyes
Narender Vaitla
|

Updated on: Feb 11, 2022 | 5:44 PM

Share

Eye Health: అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటాం. అయితే మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పులు వస్తుండంతో ఆ ప్రభావం మనిషి ఆహార్యంపై కూడా పడుతోంది. ముఖ్యంగా షిఫ్టుల్లో పనిచేస్తుండడం, స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరగడం, రాత్రుళ్లు నిద్ర లేకపోవడం కారణంగా కళ్ల కింద క్యారీ బ్యాగులతో చాలా మంది సతమతమవుతున్నారు. దీంతో ఈ క్యారీ బ్యాగ్‌లు ముఖాన్ని అందవిహీనంగా మార్చేస్తున్నాయి. మరి కొన్ని సహజ పద్ధతుల్లో ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చే విషయం తెలుసా.? క్యారీ బ్యాగ్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ టిప్స్‌ను పాటించండి..

* కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లకు చెక్‌ పెట్టడంలో బంగాళ దుంపలు చక్కగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే మంచి లక్షణాలు వదులుగా ఉన్న చర్మాన్ని టైట్‌ చేస్తుంది. ఇందుకోసం ముందుగా బంగళాదుంపను ముక్కలుగా చేసిన ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. తర్వాత కళ్లపై ప్రతి రోజూ పది నిమిషాల పాటు రుద్దాలి, అనంతరం చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ఫలితం మీకే కనిపిస్తుంది.

* కీరాదోస కంటికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. కీరాదోసలో ఉండే యాంటీఆక్సిడంట్‌ కళ్ల కింద క్యారీ బ్యాగ్‌లను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం కీరాదోసను ముందుగా ఫ్రిడ్జిలో ఉంచాలి. అనంతరం చిన్న ముక్కలుగా చేసిన కళ్లపై రుద్దితో మంచి ఫలితం ఉంటుంది.

* టమాటాల్లో ఉండే లైకోపీన్‌ చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. టమాట ముక్కల ద్వారా కళ్ల కింద ఉన్న నల్లటి మచ్చలు దూరమవుతాయి. అలాగే క్యారీ బ్యాగ్‌లకు కూడా చెక్‌ పెట్టొచ్చు.

* వీటితో పాటు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేయడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించడం, లో కార్బోహైడ్రేట్‌ డైట్‌ తీసుకోవడం, ఏ, సీ, ఈ విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అధికంగా నీరు తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు.

Also Read: BARC Recruitment 2022: BARCలో గ్రూప్ A పోస్టులకు చివరి తేదీ పొడిగింపు..ఇంజినీరింగ్‌ చేసినవారికి అవకాశం!

Andhra Pradesh Capital: పాఠ్య పుస్తకంలో ఏపీ రాజధాని మాయం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..!

Meru International School: అరుదైన ఘనత సాధించిన ‘మేరు ఇంటర్నేషన్‌ స్కూల్‌’.. రాష్ట్రంలో ఫస్ట్‌, దేశంలో 4వ స్థానం..